కర్ణాటకలో కరోనా నిర్బంధ కేంద్రం నుంచి పారిపోయిన వ్యక్తి తిరిగి ఆస్పత్రికి చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దుబాయ్ నుంచి మంగళూరు విమానాశ్రయానికి ఆదివారం వచ్చిన అతడిని కరోనా లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో నిర్భంద కేంద్రానికి తరలించారు.
ఆ రోజు అర్ధరాత్రి సమయంలో తాను ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటానంటూ వైద్య సిబ్బందితో వాదనకు దిగి బయటకు వెళ్లిపోయాడు. అతడి కోసం గాలించిన అధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఆ తర్వాత అతడిని సముదాయించి ప్రత్యేక శిబిరంలో ఉండేందుకు ఒప్పించారు అధికారులు.
కేరళలోనూ ఇంతే...
కరోనా అనుమానితుడిగా కేరళలోని ప్రత్యేక శిబిరంలో చేరి చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి సోమవారం పారిపోయాడు. ఈ నేపథ్యంలో అతడి కోసం గాలించిన అధికారులు ఎట్టకేలకు అతడిని పట్టుకుని ప్రత్యేక శిబిరానికి తరలించారు. బాధితుడు ఇటలీ నుంచి వచ్చాడు. ఇటలీ నుంచి వచ్చిన తర్వాత అతను ముగ్గురు కుటుంబసభ్యులతో సంభాషించాడని సమాచారం.
కేరళ వ్యాప్తంగా 1,116 మంది తమ పరీశీలనలో ఉన్నట్లు తెలిపిన అధికారులు.. మరో 967 మందిని గృహ నిర్బంధం చేసినట్లు స్పష్టం చేశారు. 149 మంది ఐసోలేషన్ కేంద్రంలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.
ఇదీ చూడండి: కరోనాపై కేంద్రం అప్రమత్తం.. 5400 పడకల ఏర్పాటుకు ఆదేశం