ETV Bharat / bharat

బాలికపై అత్యాచారం- గంటల వ్యవధిలో నిందితుడు అరెస్ట్

ఉత్తర్​ప్రదేశ్​లో మూడేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసులో నిందితుడ్ని పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్ట్​ చేశారు. అయితే అరెస్ట్ చేసే క్రమంలో ఎన్​కౌంటర్​ జరిగింది. దీంతో నిందితుడి కాలిలో బుల్లెట్​ దిగింది.

Man held for raping
బాలిక అత్యాచారం: గంటల వ్యవధిలో నిందితుడు అరెస్ట్
author img

By

Published : Sep 4, 2020, 5:52 PM IST

Updated : Sep 4, 2020, 6:25 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ లఖీంపుర్​ ఖేరీలో ముడేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి ఆపై ఘోరంగా హత్య చేసిన కేసును పోలీసులు చేధించారు. పోలీసులు నాలుగు బృందాలను ఏర్పాటు చేసి గంటల వ్యవధిలోనే నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో స్వల్ప కాల్పులు చోటుచేసుకోగా నిందితుడు లేఖ్​రామ్​ కాలిలో బుల్లెట్ దిగింది. దీంతో సమీప ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

నిందితుడి ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రమాదమేమీ లేదని వైద్యులు వెల్లడించారు. అవసరమైతే అతనిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేస్తామని ఉత్తర్​ప్రదేశ్‌ పోలీసులు వెల్లడించారు.

ఇదీ జరిగింది...

లఖీంపుర్​ ఖేరీలో మూడేళ్ల చిన్నారి బుధవారం కనిపించకుండా పోయింది. మరుసటి రోజు ఇంటికి సమీపంలోని చెరకు తోటలో శవమై కనిపించింది. శవపరీక్ష నిర్వహించిన వైద్యులు అత్యాచారం జరిగినట్లు నిర్ధరించారు. పాత కక్షల కారణంగా తన పక్క గ్రామానికి చెందిన వ్యక్తే ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడని చిన్నారి తండ్రి ఆరోపించాడు. పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు చేసి గంటల వ్యవధిలోనే నిందితుడ్ని పట్టుకున్నారు.

లఖీంపుర్‌ ఖేరీ జిల్లాలో 20 రోజుల వ్యవధిలో ఇది మైనర్లపై జరిగిన మూడో అత్యాచారం- హత్య ఘటన కావడం గమనార్హం.

Last Updated : Sep 4, 2020, 6:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.