మలప్పురం నివాసి మహ్మద్ రమీజ్... శుక్రవారం దుబాయి నుంచి కేరళ కారిపుర్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. విగ్ కింద దాదాపు రూ.25 లక్షల విలువైన బంగారాన్ని దాచి స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించాడు. బంగారాన్ని దాచేందుకు వీలుగా సహజంగా ఉన్న జుట్టును చాలా భాగం షేవ్ చేసుకుని విగ్ పెట్టుకున్నప్పటికీ కస్టమ్స్ అధికారులకు దొరికిపోయాడు.

- ఇదీ చూడండి: బ్యాంకులు కొల్లగొట్టి.. బాక్సాఫీస్ నిర్మాతగా..!