విమానంలో ప్రయాణిస్తుండగా బాలీవుడ్ యువ నటిని వేధించిన ఓ వ్యక్తికి 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానం. పోక్సో చట్టం కింద నమోదైన ఈ కేసు వాదనలు పూర్తయిన అనంతరం శిక్షను ఖరారు చేశారు ప్రత్యేక జడ్జి ఏడీ దేవ్.
2017లో ఘటన
2017 డిసెంబరులో ఎయిర్ విస్తారా విమానంలో ప్రయాణిస్తున్న తనను తోటి ప్రయాణికుడు వేధించాడని బాలీవుడ్ యువనటి ఆరోపించింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్లో సవివరంగా పోస్ట్ చేసింది. వెనుక సీటులో కూర్చున్న ఓ మధ్య వయసున్న వ్యక్తి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించి వేధింపులకు గురి చేశాడని వెల్లడించింది. ఈ సంఘటన దృశ్యాలను ఫోన్లో రికార్డు చేద్దామనుకున్నప్పటికీ.. వెలుతురు సరిగా లేని కారణంగా చేయలేకపోయినట్లు చెప్పింది.
ఆ ఘటన జరిగినప్పటికి ఆ బాలీవుడ్ యువనటి వయసు 17ఏళ్లు. ఆమె మైనర్ అయినందున నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
సినిమాల్లో నటించబోనని గతేడాది ప్రకటించింది ఈ బాలీవుడ్ నటి.
ఇదీ చూడండి: ఆహా: 1995 కేజీల కిచిడీతో గిన్నిస్ రికార్డు