ETV Bharat / bharat

ఆహా: 1995 కేజీల కిచిడీతో గిన్నిస్​ రికార్డు - 1995 కేజీల కిచిడీతో గిన్నిస్​ రికార్డు

హిమాచల్​ప్రదేశ్​ తట్టపాణి గ్రామంలో.. మకర సంక్రాంతి సందర్భంగా జరిగిన అన్నదాన కార్యక్రమంలో 1995కేజీల కిచిడీని తయారు చేసి ఔర అనిపించారు హాలిడే హోం హొటల్​ చెఫ్​లు. ఇది ఇప్పుడు గిన్నిస్​ బుక్​ రికార్డులో చోటు సంపాదించుకుంది.

kichidi
1995కేజీల కిచిడీ తయారీ.
author img

By

Published : Jan 15, 2020, 10:22 AM IST

Updated : Jan 15, 2020, 11:07 AM IST

ఆహా: 1995 కేజీల కిచిడీతో గిన్నిస్​ రికార్డు

1995 కేజీల కిచిడీని రూపొందించి హిమాచల్​ ప్రదేశ్​ గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించుకుంది. సంక్రాంతి వేడుకల్లో భాగంగా తట్టపాణి గ్రామంలో.. హాలీడే హోం హోటల్​కు చెందినమొత్తం 25మంది చెఫ్​లు కలిసి ఈ కిచిడీని తయారు చేశారు. దీనితో గత ఏడాది ప్రముఖ చెఫ్​ సంజీవ్​ కపూర్ తయారు చేసిన​ 918కేజీల కిచిడీ రికార్డు బద్దలైంది.

ఇంత మొత్తంలో కిచిడీని రూపొందించడానికి సుమారు 5 గంటల సమయం పట్టింది. ఈ కిచిడీ తయారీకీ 270కేజీల బరువు ఉన్న పాత్రను వినియోగించారు. తయారీ అనంతరం.. వడ్డించడం కోసం ఈ పాత్రను మోయడానికి ఓ భారీ క్రేన్​ను ఉపయోగించాల్సి వచ్చింది.

రాష్ట్ర పర్యటక శాఖ, పౌర విమానయాన శాఖ సమక్షంలో గిన్నీస్​ బుక్​ రికార్డు సర్టిఫికేట్​ను రాష్ట్ర ముఖ్యమంత్రి జయ్​ రామ్​ ఠాకూర్ అందుకున్నారు.

ప్రతిఏటా అన్నదానం

మకర సంక్రాంతి సందర్భంగా 1926 నుంచి తట్టపాణి గ్రామంలో సత్లెజ్​ నదీ స్నానానికి వచ్చిన భక్తులకు అన్నదానం కార్యక్రమాన్ని సంప్రదాయంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని దుర్గా దేవి బిహారీ లాల్ విరోచన్ లాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

ఇదీ చూడండి : మధురైలోని అవనియాపురంలో జల్లికట్టు...ప్రత్యక్షప్రసారం

Last Updated : Jan 15, 2020, 11:07 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.