ETV Bharat / bharat

'కరోనా దేవి'కి నిత్య పూజలు- రాజ్యాంగం ఇచ్చిన హక్కట! - corona goddess puja

లక్షలాది మంది ప్రాణాలను బలిగొంటున్న కరోనావైరస్​ను ప్రపంచమంతా రక్కసిగా అభివర్ణిస్తోంది. కేరళకు చెందిన వ్యక్తి మాత్రం కరోనాను దేవతగా ఆరాధిస్తున్నాడు. ఇంట్లో రోజూ పూజలు నిర్వహిస్తున్నాడు. సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ తాను చేసేది తప్పేం కాదని చెబుతున్నాడు.

Man conducts daily pujas for 'Corona Devi' in Kerala
'కరోనా దేవి'కి రోజూ పూజలు చేస్తున్న వ్యక్తి
author img

By

Published : Jun 14, 2020, 5:06 PM IST

కరోనా పేరు చెబితేనే ప్రజలు వణకిపోతున్నారు. ఆ మహమ్మారి తమ ప్రాణాలను ఎక్కడ బలిగొంటుందో అనే భయంతో బిక్కుబిక్కమంటూ జీవిస్తున్నారు. కేరళ కడక్కల్​కు చెందిన అనిలన్​ మాత్రం కరోనాను దేవతగా కొలుస్తున్నాడు. ఇంట్లో రోజూ పూజలు చేస్తున్నాడు. కరోనాపై పోరులో ముందు వరుసలో ఉన్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు, వ్యాక్సిన్​ అభివృద్ధికి శ్రమిస్తున్న శాస్త్రవేత్తల క్షేమం కోసమే తాను ఇలా చేస్తున్నానని చెబుతున్నాడు అనిలన్. పూజలు చేస్తే కరోనా దేవి వారిని కాపాడుతుందంటున్నాడు.

అనిలన్​ తీరుపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్షల మంది మృతికి కారణమైన వైరస్​ను పూజించడమేంటని మండిపడుతున్నారు. ఉచిత ప్రచారం కోసమే అనిలన్ ఇలా చేస్తున్నాడని మరికొందరు అంటున్నారు.

నేనింతే..

సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ట్రోలింగ్స్​ను తాను పట్టించుకోనని చెప్పాడు అనిలన్. ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించేందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలిపాడు.

"33 కోట్ల మంది దేవుళ్లను హిందువులు ఆరాధిస్తారు. నేను వైరస్​ను దేవతగా కొలుస్తున్నా. ఇష్టమైన వారిని పూజించడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. కరోనా దేవిని పూజించాలనుకునే భక్తులను నా ఇంటికి మాత్రం రానివ్వను. వారు ఇచ్చే కానుకలు కూడా తీసుకోను."

-అనిలన్, కేరళ వాసి.

ఈ విషయంపై ప్రముఖ రచయిత, వక్త, సునిల్​.పి.ఎలాడియం స్పందించారు.

"సమాజంలో ఓ వైపు చదువుకుని డిగ్రీలు పూర్తి చేసిన వారు అధ్యాపకులుగా, ప్రొఫెసర్లుగా, సాంకేతిక నిపుణులుగా, శాస్త్రవేత్తలుగా తయారవుతున్నారు. మరోవైపు కొందరు మూఢ విశ్వాసాలు, మత ఆచారాలు పాటిస్తూనే ఉన్నారు. ఈ రెండు విషయాల్లోనూ మనం ప్రపంచంలోనే అత్యంత స్థాయికి చేరుకున్నాం. అనిలన్ చేస్తున్న దాంట్లో తప్పేం లేదు. ఎవరి నమ్మకాలు వారికుంటాయి."

-సునిల్.పి.ఎలాడియం, రచయిత.

బిహార్​, ఝార్ఖండ్​, ఉత్తర్​ప్రదేశ్​, బంగాల్​, అసోంలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్​కు పూజలు నిర్వహించడం ఇప్పటికే ప్రారంభించారు కొందరు. అలా చేస్తే తాము వైరస్​ బారిన పడకుండా ఉంటామని వారు నమ్ముతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.