ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పుదుచ్చేరి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుడు ఆర్యన్కుప్పం గ్రామానికి చెందిన సత్యానందంగా పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం వెల్లడించారు.
ఇదీ జరిగింది..
స్థిరాస్తి వ్యాపారైన 43 ఏళ్ల సత్యానందం, రూ. ఐదు కోట్లు ఇస్తే మోదీని చంపేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ఫేస్బుక్లో వీడియో పెట్టాడు. ఇది గమనించిన ఓ కారు డ్రైవర్ పోలీసులకు గురువారం సమాచారం ఇవ్వగా, నిందితుడిని అరెస్టు చేశారు. ఐపీసీ 505 (1), 505 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
ఇదీ చదవండి : 'చట్టాల్లో సవరణలకు సిద్ధమంటే.. లొసుగులు ఉన్నట్లు కాదు'