కేరళ త్రిస్సూర్ జిల్లా చెలక్కరా ప్రాంతంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని ఎలనాడ్కు చెందిన సతీశ్(38)గా గుర్తించారు.
స్థానిక తిరుమణి కాలనీలో బాధితుడిపై దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. కత్తులతో నరికి చంపినట్లు గుర్తించారు. మృతదేహం ఓ ఇంటి ఎదుట అత్యంత దారుణమైన స్థితిలో లభించిందని, ఈ ఘటనపై విచారణ చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.
మృతుడు రెండు నెలల పెరోల్ మీద జైలు నుంచి బయటకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఓ గిరిజన బాలికపై అత్యాచారం చేసిన కేసులో శిక్ష అనుభవిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి- యోగీజీ.. విషాద ఘటనని ఒప్పుకోండి: రాహుల్