ఎన్నికల్లో వెచ్చించే ఖర్చు, ఎన్నికల సంస్కరణలపై చర్చించడానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి దీదీ లేఖ రాశారు.
"ఎన్నికల్లో వెచ్చించే ఖర్చు, సంస్కరణలే అజెండాగా అఖిలపక్ష భేటీ నిర్వహించాలని నేను కోరుతున్నాను. అవినీతికి తావు లేకుండా ఎన్నికలు జరగాలి. దేశంలో స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు జరగాలంటే సంస్కరణలే శరణ్యం" - లేఖ సారాంశం
2019 లో జరిగిన సాధారణ ఎన్నికలు అత్యంత ఖరీదైన ఎన్నికలని కొన్ని రోజుల క్రితం మమతా ఆరోపించారు. 2019 కన్నా రానున్న 2024 సాధారణ ఎన్నికల ఖర్చు దాదాపు లక్ష కోట్లు దాటే అవకాశం ఉందని మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు.
- ఇదీ చూడండి: ఆర్టీఐ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం