బంగాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ... తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు అక్రమ బొగ్గు గనుల తవ్వకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. తాజాగా మోదీ విమర్శలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు.
తమ నాయకుల్లో ఏ ఒక్కరైన అవినీతికి పాల్పడ్డట్టు నిరూపిస్తే... 42 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థులను ఉపసంహరించుకుంటానని వెల్లడించారు. ఆరోపణలను నిరూపించలేకపోతే ప్రధాని చెవులు పట్టుకుని వంద గుంజీలు తీయాలన్నారు.
భాజపాకు చెందిన వ్యక్తులే అక్రమ బొగ్గు గనుల తవ్వకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు మమత. ఈ అక్రమాలపై తన వద్ద ఓ పెన్‌డ్రైవ్ ఉందని, అది ప్రజలకిస్తే ఎన్నో నిజాలు బయటపడతాయని తెలిపారు.
ఇదీ చూడండి: 'యువ క్రికెటర్లలో పంత్ గొప్ప ఫినిషర్'