పశ్చిమ్ బంగలోని 119 వలసదారుల కాలనీలను క్రమబద్ధీకరిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయం తీసుకున్నారు. ఆ వలసదారుల పూర్వీకులు భారతీయులుగా పేర్కొన్న మమత... వారి పౌరసత్వాన్ని ఎవరూ తొలగించలేరని అన్నారు. ప్రత్యేకంగా పౌరసత్వం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు.
చూస్తూ ఊరుకోం..!
భాజపా వాళ్లు చేసే ప్రకటనలకు ఎవరూ భయపడవద్దని ప్రజలకు సూచించారు దీదీ. ఈ వలసదారులందరూ భారతీయులేనని అన్నారు. వీరందరికీ రేషన్ కార్డులు, ఓటరు గుర్తింపు కార్డులు, ఇళ్ల చిరునామాలు ఉన్నాయన్నారు. వాళ్లకు భాజపా ఇచ్చే ఏ పౌరసత్వం అక్కర్లేదని వ్యాఖ్యానించారు. ఏ ఒక్కరినైనా బంగాల్ నుంచి బయటకు పంపుతుంటే.. చూస్తూ ఉండబోనని తెలిపారు.
1971 బంగ్లాదేశ్ విభజన తర్వాత లక్షలాదిమంది ముస్లింలు, హిందువులు పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ్ బంగకు వచ్చి కాలనీల్లో ఉంటున్నారు.
ఇదీ చూడండి: ప్రజాస్వామ్య భారతాన్ని కాపాడుకోలేమా?