ప్రపంచ దేశాధినేతల ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(ఆర్‌సెప్)పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఆర్‌సెప్ ద్వారా భారత్లో తయారీ (మేక్ ఇన్ ఇండియా) కాస్త.. చైనా నుంచి కొనుగోలు (బై ఫ్రమ్ చైనా)గా మారిందన్నారు. ఈ స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం కుదిరితే భారత్లోకి చౌక ధర సరుకులు వెల్లువెత్తుతాయని.. దీని వల్ల దేశంలో నిరుద్యోగ సమస్య మరింత పెరుగుతుందని ఆరోపించారు. ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ నష్టాల్లో కూరుకుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:- నేడే 'ఆర్‌సెప్' సమావేశం- కీలక నిర్ణయం.. ఎటు?
"మేక్ ఇండియా కాస్త.. బై ఫ్రమ్ చైనాగా మారిపోయింది. ఒక్కో భారతీయుడికి ప్రతి ఏడాది రూ. 6వేలు విలువ చేసే సరుకులు దిగుమతవుతున్నాయి. 2014 నుంచి 100శాతం పెరిగిపోయింది. ఆర్‌సెప్ వల్ల భారత్లోకి చౌక ధర సరుకులు భారీగా వచ్చిపడతాయి. దాని వల్ల లక్షల ఉద్యోగాలు పోతాయి."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ఆర్సెప్పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్‌సెప్ ఒప్పందంపై భారత్ సంతకం చేస్తే.. ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎదురుదెబ్బ తగులుతుందన్నారు. దీని వల్ల రైతులు, చిరు వ్యాపారులు, దుకాణదారులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.