భారత్‌లో పర్యటిస్తున్న అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకొని దిల్లీలో చిన్నారులతో కలిసి గాలిపటాలు ఎగరేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
'గాలిపటం ఎగురవేయడానికి ఏ రోజైనా మంచిదే. భారత్‌కు ధన్యవాదాలు.' అనే కాప్షన్ ఈ వీడియోకు జతచేశారు.
చిన్ననాటి జ్ఞాపకాలు
మీరు జీవితంలో ఎప్పుడైనా గాలిపటం ఎగరేశారా? అని ఓ చిన్నారి బెజోస్‌ను ప్రశ్నించింది. దీనితో ఆయన తన బాల్యంలోకి వెళ్లిపోయారు.
బెజోస్ : నేను చిన్నతనంలో పతంగులు ఎగరేశాను. అయితే చాలా కాలం నుంచి గాలిపటాలు ఎగరేయలేదు. ఇప్పడు ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి.
మరో చిన్నారి : మీరు ఇప్పుడు ఆ సరదాలు మిస్ అవుతున్నారా?
బెజోస్ : అవును. నేను చాలా మిస్సవుతున్నాను.
ఆల్రైట్! హూ! గాలిపటాన్ని ఎగరేయడం నేర్పించిన చిన్నారులు.. మీరు అద్భుతమైన బోధకులు. ధన్యవాదాలు. (వీడియో చివర్లో పిల్లలందరికీ హైఫై ఇస్తూ... )
ప్రశంసల వర్షం
బెజోస్ వీడియోకు నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది. బెజోస్ ప్రపంచానికి ప్రేరణగా నిలుస్తున్నారని, ఇలాగే గొప్పగా ముందుకు దూసుకుపోవాలని నెటిజన్లు ఆకాంక్షించారు. బెజోస్ మీరు వినయం, వినమ్రతగలవారు# ఇండియాకు వచ్చిన మీకు ఘనస్వాగతం# అని ట్వీట్లు వెళ్లువెత్తాయి.
భారత్‌లోని అమెజాన్ కార్యకలాపాలను సమీక్షించడానికి, పారిశ్రామికవేత్తలను కలవడానికి బెజోస్ మంగళవారం వచ్చారు.
ఇదీ చూడండి: 'ఆన్-ఆఫ్'తో డిజిటల్ లావాదేవీలు మరింత సురక్షితం!