దిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో ఉందీ మహిళా పంచాయతీ. భార్య-భర్తల గొడవలు, అత్త వేధింపుల కేసులతో వీరి వద్దకు ఎందరో మహిళలు వస్తారు. వీరి మధ్య గొడవలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. తొలుత మహిళ వాదనలు వింటారు. అనంతరం ప్రతివాది వాదనలూ వింటారు. వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం అందిస్తారు. దశల వారీగా వారితో సంప్రదింపులు జరిపి గొడవ సద్దుమణగడానికి కృషి చేస్తారు. ఇలా ఎన్నో కుటుంబాలను తమ 'పంచాయతీ'తో నిలబెట్టారు.
ఓ స్వచ్ఛంద సంస్థ సహాయంతో మహిళా కమిషన్ నేతృత్వంలో ఈ పంచాయతీ పనిచేస్తోంది. న్యాయం అందించడమే కాక వితంతువులకు పింఛను, రేషన్‌కు సంబంధించిన పత్రాల పనులు చక్కబెడుతోంది.
ఎంత ప్రయత్నించినా తేలని కేసులను పోలీసులకు, మహిళా కమిషన్‌కు అప్పగిస్తుంది.