తమిళనాడు మధురై మీనాక్షి అమ్మవారి ఆలయం.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇక్కడ ఓ అరుదైన దృశ్యం సందర్శకుల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఆలయంలోని అష్ట శక్తి మందిరంలో మీనాక్షి పట్టాభిషేకం పెయింటింగ్ ఉంటుంది. ఈ చిత్రంలో కళ్లద్దాలు పెట్టుకుని కార్యక్రమాన్ని తిలకిస్తున్న మహాత్మగాంధీ కనిపిస్తారు.
ఇదీ చూడండి:- మహాత్ముడు మెచ్చిన పల్లె... ఎందుకంత ప్రత్యేకం?
మీనాక్షి అమ్మవారి పట్టాభిషేకం పెయింటింగ్‌లో బాపూజీ ఉండడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. ఆలయంలోని పాత పెయింటింగ్స్‌కు 1885లో మరమ్మతులు చేశారు. 1923లో ఈ చిత్రాలకు కొత్త రంగులు వేయాలని నిర్ణయించారు. ఆ సమయంలో గాంధీ స్వాతంత్ర్యోద్యమంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన కృషికి గౌరవ సూచకంగా పెయింటింగ్‌లో అమ్మవారి పట్టాభిషేకం తిలకిస్తున్నవారితో పాటు మహాత్ముడిని జోడించారు.
మధురై మీనాక్షి పట్టాభిషేకం
మధురై మీనాక్షికి జరిపే అతిపెద్ద ఉత్సవం పట్టాభిషేకమే. మధురై రాజు భగవాన్ సుందరేశ్వరార్ నుంచి మీనాక్షి దేవి చితిరై నెలలో బాధ్యతలు స్వీకరించి అవని నెల వరకు ఆ ప్రాంతాన్ని పాలిస్తారు. ఈ కారణంగా ఏడాదికి రెండు సార్లు అవని, చితిరై నెలల్లో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.
ఇదీ చూడండి- గాంధీ-150: అక్షర సైనికుడిగా మహాత్ముడి ముద్ర