మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుకుంటున్నారు ప్రజలు. వేకువజాము నుంచే శైవక్షేత్రాలు శివ నామస్మరణతో మార్మోగుతున్నాయి. శివలింగాలకు అభిషేకాలు చేస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు.
దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన మహారాష్ట్ర హింగోలిలోని జ్యోతిర్లింగాన్ని దర్శించుకునేందుకు వేలాది భక్తులు దేశ నలుమూలల నుంచి తరలివచ్చారు.