బలహీనుల్లో, పేదవారిలో ఎవరు శివుడిని చూస్తారో వారే నిజమైన శివారాధకులు అన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ప్రపంచమంతా ఒకటేననే వసుదైక కుటుంబమనే విశ్వాసంతో భారతీయులం జీవిస్తామని, మిగతావారిలో ఇది కనిపించదని తమిళనాడు కోయంబత్తూరులో ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి వేడుకల్లో ఆయన వ్యాఖ్యానించారు. భారతదేశమంతా ఒకే భూమిగా ఉందని దేశవ్యాప్తంగా ఉన్న జ్యోతిర్లింగాలు సూచిస్తాయని తమిళనాడు కోయంబత్తూరులో ఈశా ఫౌండేషన్ నిర్వహిస్తున్న మహా శివరాత్రి వేదికగా వ్యాఖ్యానించారు.
మన నమ్మకాలు పరిమితమై ఉండకూడదని.. మన ఆలోచనలు నిర్మాణాత్మకంగా ఉన్నాలని పేర్కొన్నారు వెంకయ్య. సహోదర భావం, శాంతి అనే భావనలతో జీవించాలని పేర్కొన్నారు. వివిధ రకాల వివక్షతలను తొలగించుకోవాలన్నారు. బలహీనుల్లో, పేదవారిలో శివుడిని చూస్తారో వారే శివారాధకులు అన్న వివేకానందుడి సూక్తులను ఉటంకించారు వెంకయ్యనాయుడు.
ఇదీ చూడండి: 'ఈశా' ఫౌండేషన్ శివరాత్రి వేడుకల్లో ఉపరాష్ట్రపతి