కేరళ కొత్త మంగళంకు చెందిన పొన్నెరిక్కల్ మహరూబ్ అనే రైతు వ్యవసాయంలో వినూత్న ప్రయోగాలు చేసి విజయవంతం అయ్యాడు.
ఎలాంటి రసాయనాలు వాడకుండా ప్రకృతి సేద్యంతోనే పసుపు పండిస్తున్నాడు. వాడి పడేసిన 200 ప్లాస్టిక్ బ్యాగుల్లో పసుపు చెట్లను పెంచి అందరినీ అబ్బురపరుస్తున్నాడు. కేవలం 23 సెంట్ల భూమిలో కొబ్బరి, అరటి చెట్లతో పాటు పలు అంతర్గత పంటలూ వేసి ఎక్కువ దిగుబడి సాధిస్తున్నాడు.
సంచుల్లో పండిన పసుపు కొమ్ములను ముడిగా అమ్మకుండా.. ఇంట్లోనే ఉడికించి, ఎండబెట్టి పొడి చేసి స్థానికులకు విక్రయిస్తున్నాడు మహరూబ్. పూర్తి సేంద్రియంగా పేరుపొందిన మహరూబ్ పసుపునకు పరిసర ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది.
వచ్చే ఏడాది ఇదే పద్ధతిలో అల్లం పండిస్తానంటున్నారు మహరూబ్.
ఇదీ చూడండి:ఈటీవీ భారత్ 'వైష్ణవ జన తో' గీతంపై రైల్వే మంత్రి ట్వీట్