దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మహారాష్ట్రలో తాజాగా 10,244 కేసులు నమోదవగా.. 263మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 14 లక్షల 54వేలకు చేరువైంది.
తమిళనాడులో కొత్తగా 5,395మంది వైరస్ బారిన పడ్డారు. మరో 62 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 6 లక్షల 25వేలు దాటింది.
- కేరళలో కరోనా కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించింది. తాజాగా 5,042 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది.
- ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో 63 మంది కరోనాకు బలయ్యారు. కొత్తగా 3,064మందికి వైరస్ సోకింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 4 లక్షల 17వేలు దాటింది.
- ఒడిశాలో తాజాగా 2,617కేసులు వెలుగుచూశాయి. 17మంది ప్రాణాలు కోల్పోయారు.
- దిల్లీలో ఒక్కరోజే 1,947 కేసులు నమోదవగా.. 32మంది చనిపోయారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 2 లక్షల 92వేల 560కు చేరింది.
- గుజరాత్లో 1,327మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలగా.. మరో 13మంది మరణించారు.
ఇదీ చూడండి: డీకేఎస్‌కు 'అక్రమాస్తుల' చిక్కులు- 57లక్షలు జప్తు