మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయ తాండవం కొనసాగుతోంది. 9,509 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 260 మందిని వైరస్ బలిగొంది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,41,228కి చేరింది. మృతుల సంఖ్య 15,576కు పెరిగింది.
తమిళనాడులో...
కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైన తమిళనాడులో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. కొత్తగా 5,875 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 98 మంది చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,57,613కు చేరింది. మొత్తం మృతుల సంఖ్య 4,132కు పెరిగింది.
కర్ణాటకలోనూ వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. 5,532 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 84 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,34,819కి చేరగా.. ఇప్పటివరకు 2,496 మంది ప్రాణాలు కోల్పోయారు.
- కేరళలో 1,169 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌కు మరొకరు బలయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 25,809కి చేరింది. 82 మంది మృత్యువాతపడ్డారు.
- దేశరాజధాని దిల్లో కొత్తగా 961 కేసులు నమోదయ్యాయి. మరో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 1,37,677కి చేరగా.. మరణాల సంఖ్య 4,004కు పెరిగింది. 1,23,317 మంది వ్యాధి బారినపడి కోలుకున్నారు.
- రాజస్థాన్‌లో కొత్తగా 1,167 కేసులు నమోదు కాగా.. 12 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 44,410కి చేరింది. మృతుల సంఖ్య 706గా ఉంది.
- ఒడిశాలో కొత్తగా నమోదైన 1434 కేసులతో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 34,913కి చేరింది. మరో 10 మంది మృతితో మరణాల సంఖ్య 197కు పెరిగింది.
- అరుణాచల్ ప్రదేశ్‌లో మరో 83 మందికి వైరస్ సోకింది. మొత్తం కేసుల సంఖ్య 1,673గా నమోదైంది.