ETV Bharat / bharat

మిలియన్​ డాలర్ల ప్రైజ్​మనీ రేసులో మహారాష్ట్ర​ టీచర్​

author img

By

Published : Oct 22, 2020, 11:32 AM IST

మహారాష్ట్రలోని ఓ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు గ్లోబల్​ టీచర్స్ ప్రైజ్ మనీకి ఎంపిక చేసే తుది జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇందులో గెలిస్తే బహుమతిగా ఆయన మిలియన్​ డాలర్లు పొందుతారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు నూరు శాతం ఉండేలా చేయడమే కాక, పాఠ్యపుస్తకాలకు క్యూఆర్​ కోడ్​ను ప్రవేశ పెట్టి విప్లవాత్మక మానర్పునకు శ్రీకారం చుట్టినందుకు గానూ ఆయనకు ఈ అరుదైన గౌరవం దక్కింది.

Maharashtra village schoolteacher in top 10 for USD 1 mn Global Teacher Prize
మిలియన్​ డాలర్ల ప్రైజ్ మనీ రేసులో 'మహా' ఉపాధ్యాయుడు

మహారాష్ట్రలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రంజిత్​సింగ్ డిసలేకు అరుదైన గౌరవం దక్కింది. గ్లోబల్ టీచర్స్​ ప్రైజ్​మనీకి ఎంపిక చేసే తుది 10మంది జాబితాలో ఆయన స్థానం సంపాదించారు. ఉపాధ్యాయుడిగా ఆయన చేసిన అద్వితీయ కృషికి గానూ ఈ గుర్తింపు పొందారు. ఒకవేళ ఆయన గెలిస్తే బహుమతిగా మిలియన్​ డాలర్లను గెలుపొందుతారు.

ప్రపంచంలోని నలుమూలలా విద్యార్థుల భవిష్యత్తును గొప్పగా తీర్చుదిద్దుతున్న ఉపాధ్యాయులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు యునెస్కో భాగస్వామ్యంతో గ్లోబల్​​ టీచర్స్​ ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. విజేతలకు మిలియన్ డాలర్లను బహుమతిగా అందిస్తోంది.

ఆదర్శ ఉపాధ్యాయుడు..

సోలాపుర్ జిల్లా పరిటేవాడి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 2009లో ఉపాధ్యాయుడిగా వెళ్లారు రంజిత్​సింగ్. ఆ సమయంలో పశువుల పాక, స్టోర్​రూమ్​కు మధ్య ఉన్న పాఠశాల భవనం శిథిలావస్తలో ఉంది. ఆయన అక్కడ విధుల చేపట్టాక పాఠశాలు రూపురేఖలే మారిపోయాయి. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను స్థానిక భాషలోకి అనువాదం చేసి వారికి పాఠాలు బాగా అర్థమయ్యేలా చేశారు. పుస్తకాలకు క్యూఆర్ కోడ్​ వ్యవస్థను ప్రవేశపెట్టి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. దీని ద్వారా విద్యార్థులు ఆడియో కవితలు, వీడియో పాఠాలు, కథలు, అసైన్​మెంట్లు పూర్తి చేసేందుకు సులభమైంది.

రంజిత్​ రాకతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. విద్య ఎంత ముఖ్యమో విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించేవారు. ఆయన శ్రమకు తగ్గ ఫలితం దక్కింది. విద్యార్థుల హాజరు శాతం నూటికి నూరు శాతం చేరింది.

రంజిత్​సింగ్​కు ఈ గుర్తింపు దక్కడంపై నటి, విద్యా ప్రచారకర్త సోహ అలి ఖాన్​ సంతోషం వ్యక్తం చేశారు. ఆయన చేసిన కృషికి ఫలితం దక్కిందని కొనియాడారు.

డిసెంబరులో ఈ అవార్డు వేడుక వర్చువల్​గా జరగనుంది. రంజిత్ సింగ్ కథ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుందని ఈ అవార్డు కార్యక్రమానికి హోస్ట్​గా వ్యవహరించనున్న స్టీఫెన్ ఫ్రై అన్నారు. ఆయన సేవలకు ధన్యవాదాలు చెప్పారు.

ఈ అవార్డు తుది జాబితాకు మొత్తం 10మందిని ఎంపిక చేశారు. రంజిత్​ సింగ్​తో పాటు నైజీరియా, బ్రిటన్​, ఇటలీ, దక్షిణాఫ్రికా, అమెరికా, దక్షిణ కొరియాలకు చెందిన మొత్తం ఏడుగురు జాబితాలో చోటు దక్కించుకున్నారు. మిగతా ముగ్గురి పేర్లను వారం తర్వాత ప్రకటిస్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.