ETV Bharat / bharat

హెచ్​ఐవీ సోకిన విద్యార్థులను బహిష్కరించిన పాఠశాల! - బీడ్​ జిల్లా వార్తలు

మహారాష్ట్రలోని ఓ జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాలలో హెచ్​ఐవీ సోకిందనే కారణంగా కొంత మంది విద్యార్థులను బహిష్కరించారని​ ఆరోపిస్తూ.. ఉపాధ్యాయులపై ఫిర్యాదు చేశారు ఓ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకుడు.

Students with HIV expelled from ZP school in Beed district
ఆ పాఠశాలలో హెచ్​ఐవీ సోకిన విద్యార్థుల బహిష్కరణ!
author img

By

Published : Feb 5, 2021, 11:37 AM IST

మహారాష్ట్ర బీడ్​ జిల్లాలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అక్కడ చదివే విద్యార్థుల్లో కొంతమందికి హెచ్​ఐవీ సోకిందనే నెపంతో వారిని బడి నుంచి వెలివేశారని 'ఇన్ఫాంట్​ ఇండియా' స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు దత్తా బార్గజే ఆరోపించారు. సదరు పాఠశాల ఉపాధ్యాయులపై అభియోగాలు మోపుతూ జిల్లా విద్యాధికారులకూ ఫిర్యాదు చేశారాయన. ఇందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వం, పాలనాధికారులు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి హెచ్​ఐవీపై అవగాహన కల్పిస్తున్న తరుణంలో.. ఇలాంటి దుర్ఘటనలు వెలుగుచూడటం బాధాకరమన్నారు బార్గజే.

ప్రధానోపాధ్యాయుని స్పందన..

అయితే.. ఈ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కేఎస్​ లాడ్​. ఇలాంటి నిందారోపణలు రాష్ట్రాన్ని అగౌరవపరుస్తాయని ఆయన చెప్పుకొచ్చారు.

"మేం పిల్లలను బహిష్కరించలేదు. వాస్తవానికి.. అలాంటి విద్యార్థులెవరూ మా పాఠశాలలో చేరలేదు. ఏటా.. అదే సంస్థ(ఇన్ఫాంట్​ ఇండియా) నుంచి 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు ఎంతో మంది మా బడిలో చేరతారు. మేమెప్పుడూ, ఎవరిపైనా వివక్ష చూపించము."

- కేఎస్​ లాడ్​, ప్రధానోపాధ్యాయులు

బీడ్​ జిల్లాలోని పాలీలో ఉండే 'ఇన్ఫాంట్​ ఇండియా' స్వచ్ఛంద సేవా సంస్థ.. అనాధ బాలలకు ఆశ్రయమిస్తోంది. వారితో పాటే హెచ్​ఐవీ బాధితులూ అక్కడే ఉంటారు.

ఇదీ చదవండి: సద్గురు పెయింటింగ్​ విలువెంతో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.