సుదీర్ఘ విరామం అనంతరం.. సామాన్య ప్రజలకు ముంబయిలో లోకల్ రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఉదయాన్నే దాదర్ రైల్వే స్టేషన్కు పెద్దఎత్తున తరలివచ్చారు ప్రయాణికులు.
తొలి రైలు సర్వీసు ఉదయం 7 గంటల వరకు నడవనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు, తర్వాత రాత్రి 9 గంటల నుంచి ఆఖరి సర్వీసు వరకు రైళ్లు తిరగనున్నాయి.
ప్రయాణికులు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని రైల్వే అధికారులు తెలిపారు. ఉల్లంఘించిన వారికి రూ.200 జరిమానా, ఒక నెల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు.
కరోనా వ్యాప్తి దృష్ట్యా గతేడాది మార్చిలో ముంబయి లోకల్ రైళ్ల సేవలు నిలిపివేశారు. లాక్డౌన్ తర్వాత తిరిగి ప్రారంభించినా... కరోనా యోధులను మాత్రమే అనుమతించారు.
ఇదీ చదవండి: పాత్రికేయుడి అరెస్టు- భగ్గుమన్న విపక్షాలు, జర్నలిస్ట్ సంఘాలు