దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో గురువారం రికార్డు స్థాయిలో 3,752 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,20,504కు చేరింది. తాజాగా మరో 100 మంది మరణించగా మృతుల సంఖ్య 5,751కి చేరింది. అయితే 1,672 మంది తాజాగా ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 60,838 మంది వైరస్‌ను జయించారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో...
ఉత్తర్‌ప్రదేశ్‌లో తాజాగా 604 కేసులు వెలుగుచూశాయి. ఒక్క రోజులో ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. మొత్తం కేసులు 15,785కు చేరింది. 23 తాజా మరణాలతో 488 మంది ఇప్పటివరకు వైరస్‌కు బలయ్యారు.
గుజరాత్లో...
గుజరాత్లో ఈ ఒక్కరోజే 510 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 25,660 మందికి కరోనా సోకింది. 31 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. 1,592 మంది ఇప్పటివరకు మరణించారు. అయితే 17,829 మంది మృత్యువు నుంచి బయటపడ్డారు.
బంగాల్లో...
బంగాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. 435 కొత్త కేసులు నమోదుకాగా.. 12 మంది వైరస్ ధాటికి బలయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 12,735కు చేరింది. 518 మంది మరణించారు.
రాజస్థాన్‌లో...
రాజస్థాన్‌లో తాజాగా 315 కరోనా కేసులు నమోదయ్యాయి. 17 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 13,87కు, మరణాల సంఖ్య 330కి చేరింది. మొత్తం మీద 10 వేల 742 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
పంజాబ్‌లో...
పంజాబ్‌లో కొత్తగా 118 కేసులు వెలుగుచూశాయి. ఇప్పటివరకు మొత్తం 3,615 మంది కరోనా బారిన పడ్డారు. గురువారం మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా... మొత్తం మరణాల సంఖ్య 83కు చేరింది.
వివిధ రాష్ట్రాలో ఇదీ పరిస్థితి...
రాష్ట్రం | తాజా కేసులు | మొత్తం కేసులు |
మహారాష్ట్ర | 3,752 | 1,20,504 |
ఉత్తర్‌ప్రదేశ్ | 604 | 15,785 |
గుజరాత్ | 510 | 25,660 |
బంగాల్ | 435 | 12,735 |
రాజస్థాన్ | 315 | 10,742 |
కర్ణాటక | 210 | 7,944 |
మధ్యప్రదేశ్ | 182 | 11,426 |
ఒడిశా | 174 | 4,512 |
పంజాబ్ | 118 | 3,615 |
గోవా | 49 | 705 |
మణిపూర్ | 52 | 606 |
హిమాచల్ ప్రదేశ్ | 4 | 590 |
నాగాలాండ్ | 0 | 64 |