మహమ్మారిపై పోరాటంలో ఓ 103 ఏళ్ల వృద్ధుడు విజయం సాధించాడు. మహారాష్ట్రలోని ఠానేలో ఇటీవల కొవిడ్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన సిద్ధేశ్వర్ తలావ్.. సోమవారం డిశ్చార్జ్ అయినట్లు అతడికి చికిత్స అందించిన వైద్యుడు సమీత్ సాహోని తెలిపారు.
నెలరోజుల క్రితం శ్వాసకోశ సంబంధిత వ్యాధితో తమ ఆస్పత్రిలో చేరిన సిద్ధేశ్వర్కు.. 20 రోజుల పాటు ఐసీయూలో చికిత్స అందించామని డాక్టర్ సమీత్ వెల్లడించారు.
సోదరుడు, మనుమడు కూడా..
సిద్దేశ్వర్తో పాటు అతడి 85 ఏళ్ల సోదరుడు కూడా తమ ఆస్పత్రిలోనే చేరారని, ఆయన కూడా త్వరలోనే కోలుకుంటాడని డాక్టర్ సమీత్ సాహోని అన్నారు. వారి మనుమడికి కూడా కొవిడ్-19 సోకగా.. అతడికి వైరస్ నయమైమందని చెప్పారు డాక్టర్.
1917లో సిద్ధేశ్వర్ జన్మించాడు. అతడు పుట్టిన ఏడాదికే ప్రపంచ మహమ్మారి స్పానిష్ ఫ్లూ ప్రబలింది. ఇప్పుడు వందేళ్ల తర్వాత అలాంటి భయంకరమైన వైరస్ నుంచి అతడు బయటపడ్డారు.
ఇదీ చదవండి: రూ.3.46 అప్పు తీర్చేందుకు 15 కి.మీ. నడక