అయోధ్యలోని తపస్వి ఛవాని మహంత్ స్వామి పరమహంస దాస్ సోమవారం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. భారత్‌ను 'హిందూ దేశం'గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్షకు పూనుకున్నారు.
ఈ సందర్భంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో హిందూ మతాన్ని అనుసరించేవారు తిరిగి భారత్‌కు రావాలని కోరారు. దేశం కోసం ప్రధాని నరేంద్రమోదీ ఏదైనా చేయగలరని విశ్వసిస్తున్నట్లు ఈటీవీ భారత్‌తో పరమహంస తెలిపారు.
"దేశ విభజన తర్వాత ముస్లిం ఆధిపత్యం కారణంగా పాకిస్థాన్‌ను ఇస్లామిక్ దేశంగా ప్రకటించారు. కానీ, హిందువులు అధికంగా ఉన్న భారత్‌ను హిందూ దేశంగా ఇప్పటివరకు ప్రకటించలేదు. తక్షణం భారత్‌ను హిందూ దేశంగా ప్రకటించాలి."
- మహంత్ పరమహంస దాస్
ఆమరణ నిరాహార దీక్ష నేపథ్యంలో పరమహంస రక్షణ కోసం భద్రతా సిబ్బందిని నియమించింది జిల్లా పాలనా విభాగం.
రామాలయం కోసం..
అంతకుముందు, పరమహంస దాస్ అయోధ్యలో రామాలయం నిర్మించాలని డిమాండ్ చేస్తూ చాలా రోజులు ఉపవాస దీక్ష చేశారు. దీక్షను భగ్నం చేసిన పోలీసులు.. మహంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా జోక్యం చేసుకోవలసి వచ్చింది. ఆ తర్వాత పరమహంస తన నిరశనను విరమించుకున్నారు.
ఇదీ చూడండి: 'మోదీజీ.. 17 ఏళ్లయింది నా పట్టా ఇప్పించండి'