దేశంలో కరోనా ధాటికి ఎక్కువగా ప్రభావితమైన మహారాష్ట్రలో.. వైరస్ కేసుల సంఖ్య 20లక్షల మార్కును దాటింది. గురువారం రాష్ట్రంలో 2,886 మంది వైరస్ బారిన పడగా 52 మంది మృతిచెందారని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు: 20,08,878
- మరణాలు: 50,634
- క్రియాశీల కేసులు: 45,622
- కోలుకున్న వారు: 19,03,408
- దేశ రాజధాని దిల్లీలో మరో 227 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,33,276కు చేరింది. వైరస్ నుంచి 246 మంది కోలుకున్నారు. మరో 8 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
- కర్ణాటకలో కొత్తగా 674మందికి కరోనా సోకింది. దీంతో వైరస్ బారినపడిన వారి సంఖ్య 9,34,252కు చేరింది. మరో ఇద్దరు చనిపోయారు. 815 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు కర్ణాటక వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది.
- రాజస్థాన్లో కరోనా బాధితుల సంఖ్య 3,16,081కి చేరింది. కొత్తగా 265మందికి వైరస్ సోకినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరో ఇద్దరు చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 2756కి పెరిగింది.
ఇదీ చదవండి:పాక్ దుశ్చర్యకు భారత జవాన్ బలి