రైతుల నిరసనలకు సంబంధించి సెలబ్రిటీలు చేసిన ట్వీట్లపై దర్యాప్తు జరుపుతామని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ప్రకటించారు. దీనిపై భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్టర్లో తీవ్రంగా స్పందించారు. మహారాష్ట్ర ప్రభుత్వం విదేశీ వ్యక్తులకు వత్తాసు పలుకుతోందని విమర్శలు గుప్పించారు.
మహా వికాస్ అఘాఢీ ప్రభుత్వం భిన్నమైన పాలనా లక్షణాలను కలిగి ఉంది. విదేశీ వ్యక్తుల విద్వేష వ్యాఖ్యలకు ఈ ప్రభుత్వం వత్తాసు పలుకుతుంది. ప్రశంసిస్తుంది. కానీ దేశభక్తులను మాత్రం వేధిస్తుంది.
- జేపీ నడ్డా ట్వీట్.
కాంగ్రెస్ నిర్ణయం..
రైతు ఆందోళనకు మద్దతుగా గ్రెటా, రిహానా వంటి సెలబ్రిటీలు గతవారం ట్వీట్ చేశారు. సచిన్, అక్షయ్ కుమార్ వంటి సెలబ్రిటీలు దీనిపై స్పందించి కేంద్రానికి మద్దుతుగా ట్వీట్ చేశారు. వీరు ట్వీట్లు చేయాలని ఎవరైనా ఒత్తిడి చేశారమో అనే విషయంపై దర్యాప్తు జరగాలని మహారాష్ట్ర కాంగ్రెస్ నేత ఒకరు అన్నారు. అనంతరం దీనిపై విచారణ చేపడతామని ఆ రాష్ట్ర హోమంత్రి అనిల్ దేశ్ముఖ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో నడ్డా విమర్శలు చేశారు.
ఇవీ చదవండి: గ్రెటా 'నిరసనల కుట్ర'పై దిల్లీ పోలీసుల కేసు