భారత్‌లో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. మహారాష్ట్రలో మళ్లీ కరోనా కేసుల్లో పెరుగుదల కనిపించింది. తాజాగా 16,476 కేసులు నమోదవగా.. మరో 394 మంది చనిపోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 14 లక్షలు దాటింది.
9వేలకు చేరులో మరణాలు.
కర్ణాటకలో కొత్తగా 10వేల 70 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మరో 130 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 6 లక్షల 11 వేలు దాటింది. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 9 వేలకు చేరువైంది.
కరోనాతో ఎమ్మెల్యే మృతి
మహమ్మారి కరోనాతో మరో ప్రజా ప్రతినిధి ప్రాణాలు కోల్పోయారు. బంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గురుపద మీతే కొవిడ్‌తో మరణించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్‌కు కరోనా సోకింది. మహారాష్ట్ర మాజీ సీఎం కొవిడ్ బారిన పడ్డారు. ఈ మేరకు ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలిపారు.
- కేరళలో ఒక్కరోజే 8,135 మంది వైరస్ బారిన పడ్డారు. ఫలితంగా మొత్తం కేసులు సంఖ్య లక్షా 50 వేలకు చేరువైంది. 29 కొత్త మరణాలతో కలిపి మృతుల సంఖ్య 771కు పెరిగింది.
- తమిళనాడులో తాజాగా 5,688 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 6 లక్షల దాటింది. మరో 66 మంది చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 9,586కు పెరిగింది.
- ఉత్తర్‌ప్రదేశ్‌లో కొత్తగా 4,095 కొవిడ్ కేసులు బయటపడగా.. 80మంది చనిపోయారు.
- దిల్లీలో తాజాగా 3,037 కేసులు నమోదయ్యాయి. మరో 41 మంది మృత్యువాతపడ్డారు.
- బంగాల్లో ఒక్కరోజే 3,275 కేసులు వెలుగు చూశాయి. మరో 59మందిప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాల సంఖ్య 5వేలు దాటింది.
ఇదీ చూడండి: 'హాథ్రస్' ఘటనపై యూపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు