మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో తాజాగా మరో నాలుగు వైరస్ కేసులు నమోదయ్యాయి. వీటిలో మూడు ముంబయిలో నమోదు కాగా, ఒకటి నవీ ముంబయిలో నిర్ధరణ అయ్యింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య 37కు చేరింది.
ఒడిశాలో మొదటి కేసు
ఒడిశాలో మొట్టమొదటి కరోనా కేసు నమోదైంది. ఇటలీ నుంచి భువనేశ్వర్ వచ్చిన ఓ వ్యక్తికి కరోనా ఉన్నట్లు నిర్ధరణ అయింది. ఇటలీలో పరిశోధకుడిగా పనిచేస్తున్న ఆ వ్యక్తి ముందుగా దిల్లీకి చేరుకున్నాడు. తర్వాత రైలుమార్గం ద్వారా భువనేశ్వర్ వెళ్లాడు. అనంతరం జ్వరం, తలనొప్పి వంటి అనారోగ్య లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడు. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు అతనికి కరోనా ఉందని తేల్చారు.
దిల్లీ నుంచి భువనేశ్వర్‌కు రైలుమార్గం ద్వారా చేరుకున్న నేపథ్యంలో అతనితో సన్నిహితంగా మెలిగిన వారందరినీ వెతికే పనిలో పడ్డారు అధికారులు.
ఇదీ చూడండి: పార్లమెంట్లో రాహుల్ ప్రశ్నకు భాజపా స్ట్రాంగ్ పంచ్