ETV Bharat / bharat

మహారాష్ట్రలో 20 వేలు.. కేరళలో 7 వేల కరోనా కేసులు - భారతదేశంలో కరోనా వైరస్​

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కేరళలో రికార్డు స్థాయిలో 7 వేల మందికిపైగా వైరస్​ బారినపడ్డారు. మహారాష్ట్రలో మరో 20 వేల 419 కొత్త కేసులు వెలుగుచూశాయి. బంగాల్​లో మరణాల సంఖ్య పెరిగిపోతోంది.

Maha adds 20,419 new COVID-19 cases; 23,644 recover, 430 die
మహారాష్ట్రలో 20 వేలు.. కేరళలో 7 వేల కరోనా కేసులు
author img

By

Published : Sep 26, 2020, 9:28 PM IST

కేరళలో రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ 7,006 మందికి వైరస్​ సోకింది. ఒక్కరోజు కేసుల్లో ఇదే అత్యధికం. లక్షా 66 వేలకుపైగా కేసులుండగా.. ప్రస్తుతం 50 వేల మందికిపైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ మరో 21 మంది చనిపోగా.. మొత్తం మరణాలు 656కు చేరాయి.

మహారాష్ట్రలో వైరస్​ విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజే 20 వేల 419 కొత్త కేసులు వెలుగుచూశాయి. మొత్తం కేసుల సంఖ్య 13 లక్షల 21 వేల 176కు చేరాయి. ఇవాళ మరో 430 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 35 వేలు దాటింది. శనివారం 23,644 మంది కరోనాను జయించి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.

  • కర్ణాటకలో మరో 8,811 కరోనా కేసులు.. 86 మరణాలు నమోదయ్యాయి.
  • తమిళనాడులో 5,647 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 85 మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 9,233కు చేరింది. మొత్తం కేసులు 5 లక్షల 75 వేల మార్కు దాటాయి.
  • బంగాల్​లో శనివారం 56 మంది మరణించారు. మరో 3,181 మంది కొవిడ్​ బారినపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 44 వేల 240కి చేరాయి.
  • గుజరాత్​లో 1417 కొత్త కేసులు బయటపడ్డాయి. మరో 13 మంది కరోనాకు బలయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.