ETV Bharat / bharat

'కసబ్​'ను ప్రాణాలతో పట్టుకున్న పోలీసులకు పదోన్నతి - one-rank promotion

ముంబయి దాడుల్లో 166 మంది ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాది అజ్మల్​ కసబ్​ను ప్రాణాలతో పట్టుకున్న 14 మంది పోలీసులకు వన్​ ర్యాంక్​ ప్రమోషన్​ ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర హోంమంత్రి అనిల్​ దేశ్​ముఖ్​ శాసనసభ ప్రాంగణంలో వెల్లడించారు.

Maha: 14 cops to get one-rank promotion for capturing Kasab
కసబ్​ను ప్రాణాలతో పట్టుకున్న పోలీసులకు ప్రమోషన్​
author img

By

Published : Mar 5, 2020, 5:06 AM IST

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో జరిగిన మారణహోమం ఎప్పటికీ మరిచిపోలేనిది. అయితే.. ఈ దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాది అజ్మల్​ కసబ్​ను ప్రాణాలతో పట్టుకున్న 14 మంది పోలీసులను గౌరవించేందుకు నిర్ణయం తీసుకుంది మహారాష్ట్ర ప్రభుత్వం. వారికి వన్​ ర్యాంక్​ ప్రమోషన్​ ప్రకటించింది.

ఈ మేరకు శాసనసభ ప్రాంగణంలో విలేకరుల సమావేశంలో రాష్ట్ర హోంమంత్రి అనిల్​ దేశ్​ముఖ్​ వెల్లడించారు.

" 26/11 దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన తుకారాం ఓంబ్లే సహా మరో 14 మంది ఉగ్రవాది అజ్మల్​ కసబ్​ను ప్రాణాలతో పట్టుకున్నారు. అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించిన వీరందరికీ వన్​ ర్యాంక్​ ప్రమోషన్​ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది."

- అనిల్​ దేశ్​ముఖ్​, మహారాష్ట్ర హోంమంత్రి.

2008, నవంబర్​ 26న 10 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు సముద్ర మార్గం గుండా ముంబయిలోకి ప్రవేశించి సుమారు 166 మంది పౌరులు, 18 మంది భద్రతా సిబ్బందిని పొట్టనపెట్టుకున్నారు. కోట్లు విలువైన ఆస్తులను ధ్వంసం చేశారు. ఉగ్రవాదుల్లో ఒకడైన కసబ్​ను పోలీసులు సజీవంగా పట్టుకున్నారు. 2012, నవంబర్​ 21న కసబ్​ను ఉరి తీశారు.

ఇదీ చూడండి: జమ్ముకశ్మీర్​లో ఉగ్రదాడి-ఎస్పీఓ సహా ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.