ETV Bharat / bharat

లైవ్​: మధ్యప్రదేశ్​ రాజకీయాలపై సర్వత్రా ఉత్కంఠ

MADYA PRADESH POLITICAL CRISIS LIVE UPDATES
లైవ్​: సుప్రీం చేతిలో కమల్​నాథ్​ భవితవ్యం!
author img

By

Published : Mar 18, 2020, 11:54 AM IST

Updated : Mar 18, 2020, 1:27 PM IST

13:23 March 18

ఉపఎన్నికల తర్వాత...

అసెంబ్లీలోని ఖాళీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిపిన తర్వాతే విశ్వాస పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టుకు కాంగ్రెస్​ విజ్ఞప్తి చేసింది. దీనిని భాజపా ఖండించింది. ఎట్టిపరిస్థితుల్లోనైనా బలపరీక్ష వెంటనే నిర్వహించాలని తెలిపింది.

12:18 March 18

గవర్నర్​ వద్దకు...

ఈ రోజు మధ్యాహ్నం 1:30 గంటలకు గవర్నర్​ లాల్జీ టాండన్​ను కాంగ్రెస్​ నేతల బృందం కలవనుంది. రాష్ట్ర రాజకీయాల్లోని తాజా పరిణామాలపై చర్చించే అవకాశముంది.

12:04 March 18

కాంగ్రెస్​ సమాధానం

శివరాజ్​ సింగ్​ చౌహాన్​ వ్యాజ్యంపై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్​ ప్రభుత్వం సమాధానాన్ని.. న్యాయవాది దుశ్యంత్​ దేవ్​ వినిపిస్తున్నారు. ప్రజల నమ్మకంతో కాంగ్రెస్​ ప్రభుత్వం 18 నెలలుగా రాష్ట్రాన్ని పాలిస్తోందని తెలిపారు. కానీ ఇప్పుడు భాజపా.. తన బలాన్ని ఉపయోగించి ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.

11:57 March 18

సింధియా తిరుగుబాటుతో...

మధ్యప్రదేశ్​లో కీలక నేత జోతిరాదిత్య సింధియా కాంగ్రెస్​ పార్టీకి రాజీనామా చేయడం, ఆయన మద్దతుదారులైన 22 మంది​ ఎమ్మెల్యేలు తమ పదవులను వదులుకోవటం వల్ల సంక్షోభం నెలకొంది. వీరంతా భాజపాలో చేరతారని అందరు అనుకున్నప్పటికీ.. సింధియా ఒక్కరే కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో బలపరీక్షపై సందిగ్ధత నెలకొంది.

బెంగళూరులోని ఓ రిసార్ట్​లో ఉన్న 22 మంది ఎమ్మెల్యేల్లో కొందరు భాజపాలో చేరేందుకు సుముఖంగా లేరనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని కాంగ్రెస్​ పార్టీకి చెందిన కొందరు నేతలు బహిరంగంగానే ప్రకటించారు. తిరిగి పార్టీలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. అయితే.. ఆరుగురి రాజీనామాలను స్పీకర్​ ఆమోదించారు.

11:38 March 18

సుప్రీం విచారణ

మధ్యప్రదేశ్​ రాజకీయాలపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. కమల్​నాథ్​ ప్రభుత్వానికి వెంటనే బలపరీక్ష నిర్వహించే విధంగా ఆదేశాలు జారీ చేయాలన్న వ్యాజ్యంపై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ పిటిషన్​ను భాజపా సీనియర్​ నేత శివరాజ్​ సింగ్​ చౌహాన్​ దాఖలు చేశారు.

స్పీకర్​ నిర్ణయంతో..

గవర్నర్ లాల్జీ టాండన్​​ ఆదేశాల మేరకు.. మధ్యప్రదేశ్​ అసెంబ్లీలో సోమవారమే బలపరీక్ష జరగాల్సి ఉంది. కరోనా వైరస్​ కారణంగా సభను ఈ నెల 26 వరకు వాయిదా వేశారు స్పీకర్​ ప్రజాపతి.

స్పీకర్​ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్​ దాఖలు చేశారు భాజపా సీనియర్​ నేత శివరాజ్​సింగ్​ చౌహాన్​. వెంటనే బలపరీక్ష నిర్వహించే విధంగా కమల్​నాథ్​ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ పిటిషన్​పై స్పందించాలని మధ్యప్రదేశ్​ ప్రభుత్వాన్ని మంగళవారం ఆదేశించింది కోర్టు. బుధవారం ఉదయం 10:30 గంటల లోపు కమల్​నాథ్​ ప్రభుత్వం.. సర్వోన్నత న్యాయస్థానానికి వివరణ ఇవ్వాల్సి ఉంది.

Last Updated : Mar 18, 2020, 1:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.