ETV Bharat / bharat

ఐరాస గుడ్​విల్​ అంబాసిడర్​గా క్షురకుని కుమార్తె - ఐరాస గుడ్​విల్ అంబాసిడర్

ఇటీవల మన్​కీబాత్​లో ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించిన ఓ బాలికకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఐరాస అసోసియేషన్​ ఫర్​ డెవలప్​మెంట్ అండ్ పీస్​ (యూఎన్​ఏడీఏపీ)కి గుడ్​విల్​ అంబాసిడర్​గా ఎంపికైంది. న్యూయార్క్​, జెనీవాల్లో జరిగే ఐరాస సమావేశాల్లో ప్రసంగించే అవకాశం దక్కించుకుంది.

UNADAP Goodwill Ambassador
నేత్ర
author img

By

Published : Jun 6, 2020, 7:26 PM IST

తమిళనాడు మధురైకి చెందిన 13 ఏళ్ల నేత్రకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్ ఫర్ డెవలప్​మెంట్ అండ్ పీస్​ (యూఎన్​ఏడీఏపీ)కి 'గుడ్​విల్​ అంబాసిడర్​ ఫర్ పూర్​' గా ఎంపికైంది.

నేత్ర తండ్రి మోహన్​.. మధురైలోని ఓ క్షౌరశాల యజమాని. ఆమె చదువు కోసం రూ.5 లక్షలు జమ చేశాడు. లాక్​డౌన్​ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి ఈ డబ్బును విరాళంగా ఇచ్చేలా తన తండ్రిని నేత్ర ఒప్పించింది.

నేత్ర చూపిన చొరవను మంత్రి సెళ్లూరు రాజు మెచ్చుకున్నారు. ఆమెకు జయలలిత పురస్కారం అందించాలని ముఖ్యమంత్రి కె.పళనిస్వామికి సిఫార్సు చేస్తానని వెల్లడించారు.

"కొన్ని రోజుల క్రితం ప్రధాని నరేంద్రమోదీ నేత్రను మెచ్చుకున్నారు. మధురైకి ఆమె గర్వకారణం. ఐరాస నేతలతో కలిసే అవకాశం రావటం సంతోషంగా ఉంది. పేద ప్రజల ఆర్థిక పరిస్థితికి సంబంధించిన కార్యక్రమానికి హాజరుకాబోతున్నా. నేత్రకు జయలలిత పురస్కారాన్ని ప్రకటించాలని ముఖ్యమంత్రికి సిఫార్సు చేస్తా."

- సెళ్లూరు రాజు

మోదీ ప్రశంస..

మన్​కీ బాత్​ కార్యక్రమంలో భాగంగా నేత్ర తండ్రి మోహన్​ను ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. అతను కష్టపడి జమ చేసుకున్న మొత్తాన్ని ఆపదలో ఉన్నవారికి అందజేశాడని మెచ్చుకున్నారు.

అంతర్జాతీయ వేదికలపై..

న్యూయార్క్​, జెనీవాలో జరిగే ఐరాస నిర్వహించే పౌర సమాజ వేదికలు, సమావేశాల్లో నేత్రకు ప్రసంగించే అవకాశం ఇచ్చినట్లు యూఎన్​ఏడీఏపీ ప్రకటించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.