ETV Bharat / bharat

క్షీణించిన లాల్జీ టండన్ ఆరోగ్యం.. వెంటిలేటర్​పై చికిత్స - క్షీణించిన లాల్జీ టాండన్ ఆరోగ్యం.. వెంటిలేటర్​పై చికిత్స

మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టండన్ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆయనను ప్రస్తుతం వెంటిలేటర్​పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.

lalji
క్షీణించిన లాల్జీ టాండన్ ఆరోగ్యం.. వెంటిలేటర్​పై చికిత్స
author img

By

Published : Jun 16, 2020, 1:54 PM IST

మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ ఆరోగ్యం మరింత క్షీణించింది. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. జూన్ 11న శ్వాసకోశం, మూత్రనాళాల్లో సమస్యలు, జ్వరంతో బాధపడుతూ స్వస్థలం యూపీ లఖ్​నవూలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అనంతరం సోమవారం ఆరోగ్యం క్షీణించిన కారణంగా ఆయనను వెంటిలేటర్​పై ఉంచారు. ఈ మేరకు ఆస్పత్రి వర్గాలు టండన్ ఆరోగ్య బులెటిన్​ను విడుదల చేశాయి.

లాల్జీ కడుపులో అంతర్గత రక్తస్రావం జరిగిందని.. ఇందుకోసం ఆయనకు అత్యవసర సర్జరీ చేసినట్లు ఆస్పత్రి అధికారులు ప్రకటించారు. ఆపరేషన్ విజయవంతమైందని చెప్పారు. సోమవారం ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయంలో సమస్యలు ఉత్పన్నమయిన కారణంగా ఆయనను వెంటిలేటర్​పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: ఇంకా ఐసీయూలోనే మధ్యప్రదేశ్​ గవర్నర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.