మధ్యప్రదేశ్ రాష్ట్ర కేబినెట్‌ను విస్తరించారు ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్. దిల్లీలో భాజపా అధినాయకత్వంతో సంప్రదించిన ఆయన... కొత్తగా 28 మందికి తన మంత్రి వర్గంలో చోటుకల్పించారు.
జ్యోతిరాధిత్య సింధియా వర్గం తిరుగుబాటుతో కాంగ్రెస్ నేతృత్వంలోని కమల్‌నాథ్ ప్రభుత్వం కుప్పకూలగా.. భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. భాజపాలో చేరిన సింధియా అనుచరులకు మంత్రి వర్గంలో ప్రాధాన్యం ఇచ్చారు శివరాజ్‌సింగ్ చౌహాన్. అలాగే 12 మంది భాజపా వినయవిధేయులకు మంత్రులుగా అవకాశం కల్పించారు.
మంత్రులుగా ప్రమాణ స్వీకారం..
భాజపా నేతలు గోపాల్ భార్గవ, యశోధర రాజే సింధియా కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఇమర్తి దేవి, ప్రభురామ్ చౌదరి, ప్రద్యుమాన్ సింగ్ తోమర్ మంత్రులుగా ప్రమాణం చేశారు.
మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు. దీనితో ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్.. ఎంపీ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కొవిడ్-19 మార్గదర్శకాల ప్రకారమే ఈ కార్యక్రమం నిర్వహించారు.
రికార్డు స్థాయిలో
శివరాజ్‌సింగ్ చౌహాన్ రికార్డు స్థాయిలో 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మార్చి 23న.. 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కమల్‌నాథ్ సర్కార్‌కు ఎదురుతిరిగిన నేపథ్యంలో ఆయనకు ఈ అవకాశం దక్కింది.
చౌహాన్ ఏప్రిల్ 21న కేవలం ఐదుగురు మంత్రులతో మినీ కేబినెట్ ఏర్పరిచారు. తాజాగా మరో 28 మందికి తన మంత్రివర్గంలో చోటుకల్పించారు.
ఇదీ చూడండి: ఇద్దరు భారతీయ అమెరికన్లకు అరుదైన గౌరవం