తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామిపై విమర్శలు చేయడం మానుకోవాలని డీఎంకే చీఫ్ స్టాలిన్‌కు సూచించింది మద్రాసు హైకోర్టు. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వ్యక్తి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం తగదని పేర్కొంది.
ముఖ్యమంత్రి, స్పీకర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ స్టాలిన్‌పై పరువునష్టం దావా వేసింది తమిళనాడు ప్రభుత్వం. దీనిని కొట్టివేయాలని స్టాలిన్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన జస్టిస్ సతీశ్ కుమార్.. స్టాలిన్ వ్యాఖ్యలతో కోర్టు తీవ్ర అసంతృప్తి చెందినట్టు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:- తలైవా.. తమిళ రాజకీయాలను మార్చేస్తారా?
స్టాలిన్‌తో పాటు ఇతర నేతలు.. తమ రాజకీయ లబ్ధి కోసం తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని జస్టిస్ సతీశ్ వ్యాఖ్యానించారు. ఆరోపణలకు ఆధారాలుంటే.. కోర్టును సంప్రదించాలని, అంతేకానీ భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని స్పష్టం చేశారు. ప్రజలను ఇవి తప్పుదోవ పట్టిస్తాయన్నారు.
ఇప్పటికే స్టాలిన్‌పై ఉన్న పలు పరువునష్టం దావాలను కొట్టివేసింది హైకోర్టు. అయితే దాని అర్థం.. ఘాటు వ్యాఖ్యలు చేయడానికి అనుమతులిచ్చినట్టు కాదని జస్టిస్ సతీశ్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి:- ఈ నెల 13 నుంచి కమల్ ఎన్నికల ప్రచారం