ETV Bharat / bharat

మరోసారి 'సైంటిస్ట్ ఆఫ్​ ది ఇయర్'​గా హేమంత్ - Hemant Kumar Pandey

చర్మంపై తెల్ల మచ్చలు నివారించడానికి 'లుకోస్కిన్​' ఔషధాన్ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త హేమంత్​ కుమార్​ పాండే.. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ) ఇచ్చే 'సైంటిస్ట్​ ఆఫ్​ ది ఇయర్'​ అవార్డు​ అందుకున్నారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో బహుమతి ప్రదానం చేశారు రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్.

'Lukoskin' developer Hemant Kumar Pandey gets DRDO's 'Scientist of the Year' award
హేమంత్​కు రెండోసారి సైంటిస్ట్ ఆఫ్​ ది ఇయర్​ ​అవార్డు
author img

By

Published : Dec 27, 2020, 7:10 AM IST

సీనియర్ శాస్త్రవేత్త హేమంత్​ కుమార్​ పాండే రెండోసారి డీఆర్​డీఓ'సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు' గ్రహీతగా నిలిచారు. ల్యూకోడెర్మా చికిత్స కోసం తయారు చేసిన ప్రసిద్ధ ఔషధమైన లుకోస్కిన్​తో సహా వివిధ మూలికా ఔషధాలను అభివృద్ధి చేయడంలో ఆయన చేసిన కృషికి గానూ ఈ అవార్డు దక్కింది. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో హేమంత్​కు ప్రతిష్ఠాత్మక అవార్డుతో పాటు ధ్రువపత్రం, రూ.2 లక్షల నగదు బహుమతిని అందించారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్​ సింగ్​.

హేమంత్​ కుమార్​.. ఇప్పటివరకు ఆరు మూలికా ఔషధాలను అభివృద్ధి చేశారు. తాజాగా మూలికలతో అభివృద్ధి చేసిన ఈ ఔషధాన్ని దిల్లీలోని అమిల్​​ ఫార్మాస్యూటికల్స్​ 'లుకోస్కిన్​' పేరుతో యాంటీ-ల్యూకోడెర్మా ఉత్పత్తిని మార్కెట్లోకి విడుదల చేసింది. చర్మంపై తెల్ల మచ్చలు నివారించడానికి లుకోస్కిన్​ను ఉపయోగిస్తారు. ఈ ఔషధం మార్కెట్​లో విస్తృతంగా ప్రసిద్ధి చెందింది.

మూలికా వైద్య రంగంలో ఆయన చేసిన కృషికి పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకున్న పాండే.. 2018లోనూ ఈ అవార్డు అందుకున్నారు. గత 25 ఏళ్లుగా ఉత్తరాఖండ్‌లోని పిథోరాగఢ్​‌లోని డీఆర్‌డిఓకి చెందిన ల్యాబ్ డిఫెన్స్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ బయో ఎనర్జీ రీసెర్చ్​ (డీబీఈఆర్​)లో పరిశోధనలు చేస్తున్నారు హేమంత్​.

ఇదీ చూడండి: 'గగన్​యాన్​ ప్రయోగం కోసం హరిత ఇంధనం అభివృద్ధి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.