ఉత్తరప్రదేశ్ అమేఠీ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు నామినేషన్ వేయనున్నారు. తొలుత మున్శిగంజ్-దర్పిపుర్ నుంచి గౌరిగంజ్ వరకు జరిగే రోడ్ షోలో కాంగ్రెస్ అధ్యక్షుడు పాల్గొంటారు. అనంతరం అమేఠీ జిల్లా పరిపాలనా కార్యాలయంలో నామపత్రం దాఖలు చేస్తారు. రాహుల్‌తో పాటు ఏఐసీసీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా హాజరవుతారు.
అమేఠీ లోక్‌సభ స్థానానికి 15 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు రాహుల్. 2014లో కాంగ్రెస్ అధ్యక్షుడిపై పోటీ చేసిన భాజపా నేత స్మృతి ఇరానీ ఈసారీ ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఆ ఎన్నికల్లో స్మృతి ఇరానీపై రాహుల్ గాంధీ లక్ష ఓట్లకుపైగా మెజారిటీతో గెలిచారు.
ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నెల 4న కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి నామపత్రం దాఖలు చేశారు.