తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన ప్రముఖ లాటరీ నిర్వాహకుడు మార్టిన్ శాండియాగోకు సంబంధించిన 70 ప్రాంతాల్లో ఐటీ శాఖ సోదాలు ముగిశాయి. ఏప్రిల్ 30 నుంచి కోయంబత్తూరు, చెన్నై, కోల్కతా, ముంబయి, దిల్లీలో శాండియాగోకు చెందిన పలు ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేశారు.
ఇప్పటి వరకు రూ. 595 కోట్ల లెక్క చూపని నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ శాఖ అధికారులు తెలిపారు. లెక్క తేలని రూ. 24 కోట్ల 57 లక్షలు విలువ చేసే వజ్రాలు, నగదుపై నిషేధాజ్ఞ విధించారు.
ఏమైనా దస్త్రాలు, వస్తువులపై అనుమానముంటే వాటిపై నిషేధాజ్ఞ విధిస్తారు. తగిన విచారణ చేశాక నిర్ణయాన్ని బట్టి వాటిని తిరిగి అప్పగిస్తారు లేదా స్వాధీనం చేసుకుంటారు.
వివిధ రాష్ట్రాల్లో లాటరీలు నిర్వహిస్తోన్న ఈ బృందానికి రియల్ఎస్టేట్ వ్యాపారాలతో సంబంధమున్నట్లు అధికారులు గుర్తించారు.
ఇదీ చదవండి: ఫొని విధ్వంసం, సహాయక చర్యలపై కేంద్రం ఆరా