ETV Bharat / bharat

మానవ హక్కుల బిల్లుకు లోక్​సభ ఆమోదం

మానవ హక్కుల చట్ట సవరణ బిల్లుకు లోక్​సభ ఆమోదం తెలిపింది. ఈ కొత్త చట్టం మానవ హక్కులను మరింత సమర్థంగా కాపాడుతుందని కేంద్రం హామీ ఇచ్చింది.

మానవ హక్కుల బిల్లుకు లోక్​సభ ఆమోదం
author img

By

Published : Jul 19, 2019, 6:41 PM IST

మానవ హక్కుల చట్టం సవరణ బిల్లుకు లోక్​సభ ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం ఉన్న చట్టంలోని కీలక అంశాలను సవరిస్తూ తీసుకొచ్చిన బిల్లుకు విపక్షాలు అభ్యంతరం తెలిపినా సభ అంగీకారం తెలిపింది. ఈ చట్టం మానవ హక్కులను మరింత సమర్థంగా కాపాడుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్​ రాయ్​ స్పష్టం చేశారు.

బిల్లులోని అంశాలు..

  • మానవ హక్కుల కమిషన్​ ఛైర్మన్​ పదవీ కాలాన్ని 5 ఏళ్ల నుంచి మూడేళ్లకు కుదింపు
  • కమిషన్​ ఛైర్మన్​గా భారత విశ్రాంత ప్రధాన న్యాయమూర్తితో పాటు సుప్రీం విశ్రాంత న్యాయమూర్తులనూ నియమించవచ్చు.
  • రాష్ట్రాల కమిషన్​లోనూ హైకోర్టు న్యాయమూర్తులను నియమించవచ్చు.
  • కమిషన్​లో సభ్యుల సంఖ్య పెంపు

ఇప్పుడున్న ఎస్సీ, ఎస్టీ, మహిళా జాతీయ కమిషన్ సభ్యులతో పాటుగా బీసీ, బాలల హక్కుల సంరక్షణ జాతీయ కమిషన్లు, దివ్యాంగుల శాఖ చీఫ్​ కమిషనర్​ కమిషన్​లో భాగస్వాములుగా ఉంటారు.

  • పాలన పరమైన అధికారాలతో పాటు ఆర్థికంగా మరింత బలోపేతం

మరో 3 కీలక బిల్లులు

లోక్​సభలో నేడు మరో మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. సమాచార హక్కు చట్టం సవరణ, పోంజి పథకాలకు చెక్​పెట్టే బిల్లుతో పాటు ట్రాన్స్​జెండర్ల హక్కులను రక్షించే బిల్లులను ఎన్​డీఏ ప్రభుత్వం సభలో ప్రతిపాదించింది.

ఇదీ చూడండి: గవర్నర్​ డెడ్​లైన్​ బేఖాతరు - వీడని ఉత్కంఠ

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
+++SCRIPT AND SHOTLIST TO FOLLOW+++
SHOTLIST: National Stadium, Singapore - 19th July 2019
1. 00:00
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: SNTV
DURATION: 02:51
STORYLINE:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.