ETV Bharat / bharat

కరోనా వేళ.. లోక్​సభ ఎంపీలకు డిజిటల్​ హాజరు

కరోనా తీవ్రంగా ఉన్నా.. సెప్టెంబర్​ 14 నుంచి పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో లోక్​సభకు వచ్చే ఎంపీల హాజరును డిజిటల్​ రూపంలో నమోదు చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్​ రూపొందించారు. దీనివల్ల అటెండెన్స్​ రిజిస్టర్​పై ప్రత్యక్షంగా సంతకం చేయడం తప్పుతుంది.

Lok Sabha MPs to mark attendance through mobile app amid COVID-19
లోక్​సభ ఎంపీలకు డిజిటల్​ హాజరు..
author img

By

Published : Sep 11, 2020, 3:06 PM IST

పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలకు సమయం దగ్గర పడుతోంది. కరోనా వైరస్​తో ముప్పు ఉన్నప్పటికీ కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య సమావేశాలు నిర్వహించనున్నారు. అయితే హాజరయ్యే ఎంపీల ఆరోగ్య విషయంలోనూ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ప్రతి ఒక్కరూ కరోనా టెస్టులు చేయించుకోవాలనే అంశం తెరపైకి రాగా తాజాగా హాజరులోనూ మార్పులు చేస్తున్నారు.

డిజిటల్​ అటెండెన్స్​..

ఈ సమావేశాల్లో లోక్​సభ ఎంపీల హాజరును డిజిటల్​ రూపంలో నమోదు చేయనున్నారు. నేషనల్​ ఇన్ఫర్మేటిక్స్​ సెంటర్​(ఎన్​ఐసీ) తయారు చేసిన అటెండెన్స్​ రిజిస్టర్​ యాప్​ ద్వారా సభ్యులంతా హాజరు నమోదు చేసుకోనున్నారు. ఫలితంగా అటెండెన్స్​ రిజిస్టర్​పై సంతకం చేసే విధానానికి తాత్కాలికంగా చెక్​ పడనుంది.

"ఈ యాప్​ పార్లమెంటు పరిసరాల్లో మాత్రమే పనిచేస్తుంది. ప్రతి ఎంపీ ఫేస్​ను స్కాన్​ చేసి అప్​లోడ్​ చేస్తాం. అలా వారి హాజరును నమోదు చేస్తాం." అని ఓ సీనియర్​ అధికారి పేర్కొన్నారు.

ఈ అప్లికేషన్​లో డాష్​బోర్డు, సాధారణ దరఖాస్తులు, హాజరు, ఈ-రిపోర్టులు, సెలవు దరఖాస్తులు వంటివి ఉంటాయి. ఇదే యాప్​ను సెక్రటేరియట్​ సిబ్బందికి ఉపయోగిస్తారని సమాచారం.

నవంబర్​ 14 నుంచి...

పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్​ 14న ప్రారంభమై అక్టోబర్​ 1న ముగియనున్నాయి. కరోనా కారణంగా తొలిసారి లోక్​సభ, రాజ్యసభ సమావేశాలు వేరువేరు సమయాల్లో నిర్వహిస్తున్నారు.

సెప్టెంబర్​ 14న.. దిగువ సభ ఉదయం 9 నుంచి మధ్యహ్నం 1 వరకు, ఎగువ సభ మధ్యహ్నం 3 నుంచి రాత్రి 7 వరకు జరగనుంది.

మిగతారోజుల్లో రాజ్యసభ ఉదయం 9 నుంచి మధ్యహ్నం 1 వరకు, లోక్​సభ మధ్యహ్నం 3 నుంచి రాత్రి 7 వరకు నిర్వహించనున్నారు.

సమావేశాలు రోజుకు నాలుగు గంటలు మాత్రమే జరగనున్నాయి. ఇప్పటికే లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్య నాయుడు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర హోంశాఖ, ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్​, డీఆర్​డీఓ అధికారులతో చర్చిస్తున్నారు.

కరోనా నేపథ్యంలో పార్లమెంట్​ సమావేశాలకు వేల సంఖ్యలో మాస్కులు, చేతి గ్లౌజులు, వందల కొద్ది శానిటైజర్​ బాటిళ్లు, ఫేస్​ సీల్డ్​లు అందుబాటులో ఉంచనున్నారు. స్వయంచాలితంగా తెరుచుకునే డోర్లు, చేతులు తగలకుండా పనిచేసే శానిటైజర్లు, థర్మల్​ స్క్రీనింగ్​ వంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపీలు, సిబ్బందితో పాటు సుమారు 4 వేల మందికి కరోనా పరీక్షలు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.