లోక్‌సభ సమావేశాలను బహిష్కరించిన విపక్షాలు
కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు లోక్‌సభ సమావేశాలను బహిష్కరించాయి. రాజ్యసభలో సస్పెండైన 8 మంది ఎంపీలకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌధరి. బాయ్‌కాట్ ఎంతకాలం కొనసాగుతుందో స్పష్టం చేయలేదు. ఈ నేపథ్యంలో రాజ్యసభ కార్యకలాపాల గురించి లోక్‌సభలో ప్రస్తావించవద్దని హెచ్చరించారు సభాపతి ఓం బిర్లా. సభ్యులు చేసిన అన్ని సూచనలను రికార్డుల నుంచి తొలగించనున్నట్లు స్పష్టం చేశారు.
వాకౌట్ చేసిన పార్టీల్లో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ, తెరాస ఉన్నాయి. అంతకుముందు వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలంటూ విపక్షాలు చేసిన నిరనసలతో లోక్‌సభ పలుమార్లు వాయిదా పడింది.