ETV Bharat / bharat

'అవే మిడతల ఆవాసాలు.. సాయంత్రాల్లోనే దాడులు' - Types of locust attack

కరోనా మహమ్మారితో ఓవైపు సతమతమవుతుంటే.. ఇప్పుడు మిడతల దండు మరింత కలవరపెడుతోంది. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో పంటలను నాశనం చేసిన మిడతల దండు.. మరోసారి భారత్​పై విరుచుకుపడే అవకాశం ఉందని ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ అంచనా వేసింది. ఈ క్రమంలోనే మిడతలను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తున్నారు నిపుణులు.

Types of locust attack and its impact on crops
'ఆ ప్రాంతాలే మిడతల ఆవాసం.. సాయంత్రాల్లో పంటలపై దాడులు'
author img

By

Published : Jun 7, 2020, 4:42 PM IST

దేశాన్ని ఓ వైపు కరోనా పట్టి పీడిస్తుంటే.. మరోవైపు మిడతల దాడి పెద్ద సవాలుగా మారింది. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో విరుచుకుపడిన ఈ దండుతో.. అధిక సంఖ్యలో పంట నష్టం వాటిల్లింది. అనేక జిల్లాలకు హై అలెర్ట్​ ప్రకటించారు. త్వరలో మళ్లీ ఈ గుంపు భారత్​వైపు వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ అంచనా వేసింది. ఈ క్రమంలోనే హరియాణాకు చెందిన ప్రముఖ ఎంటమాలజిస్ట్​ యోగేశ్​ కుమార్.. మిడతలతో పొంచి ఉన్న ముప్పును, వాటిని నియంత్రించేందుకు తమ రాష్ట్రంలో తీసుకున్న చర్యలను వివరించారు.

సాధారణంగా మిడతలు గుంపులుగా దాడి చేస్తాయని యోగేశ్​ కుమార్​ తెలిపారు. 10వేల మిడతలు పంటపై పడినప్పుడు రైతుకు వాటిని కట్టడి చేయడం ఆసాధ్యమని.. కాబట్టి నివారణ పద్దతులను పాటించాలని సూచించారు.

ఒక రోజులో సుమారు 2,500 మందికి సరిపడే ఆహారాన్ని మిడతల దండు తినేస్తుందని.. అవి దాడి చేసే ముందే పంటకు క్రిమి సంహారక మందులు పిచికారీ చేయడం మంచిదని వివరించారు యోగేశ్​. ఇందుకోసం క్లోరోపిరిఫోస్​, 20 సీఏబీ, 50 సీఏబీ, లామ్​డా సైలోథ్రిన్​, డెల్టామాత్రిన్​ వంటి పురుగుల మందులను వాడాలని సూచించారు.

మిడతలు ప్రధానంగా ఎడారి ప్రాంతంలో సంతానోత్పత్తి చేస్తాయి. భారత్​లో రాజస్థాన్​, గుజరాత్​లోని భుజ్ ప్రాంతాలు ఇందుకు అనువుగా ఉన్న ప్రదేశాలు. మిడతలపై వాతావరణం ఎటువంటి ప్రభావం చూపదు. అవి తేమగా ఉన్న ఇసుక నేలల్లో గుడ్లు పెడతాయి. 3 నెలల్లో మూడు దఫాలు 80 నుంచి 90 గుడ్లు పెట్టే అవకాశం ఉంది.

-యోగేశ్​ కుమార్​, ఎంటమాలజిస్ట్​

రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హరియాణా రాష్ట్రాల్లో మిడతలు ముప్పేట దాడి చేసి అధిక సంఖ్యలో పంటలను నాశనం చేశాయి. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాల్లో హై అలెర్ట్​ ప్రకటించారు అధికారులు. వీటి నివారణలో భాగంగా డ్రోన్లతో క్రిమిసంహారక మందులు చల్లించారు. ఇందుకోసం బ్రిటన్​ నుంచి 15 స్ప్రేయర్లు కొనుగోలు చేయనున్నట్లు గతంలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రభావిత ప్రాంతాల్లో నియంత్రణ కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించనున్నట్లు స్పష్టం చేసింది.

గతంలోనే అనేక దాడులు...

దేశంలో మిడతలు దాడి అనుభవాలు కొత్తేం కాదు. గతంలోనూ అనేక సార్లు ఈ దండు విరుచుకుపడినట్లు మిడతల హెచ్చరిక సంస్థ ఓ నివేదికలో పేర్కొంది. 1980-90 మధ్య తీవ్రమైన మిడతల దాడిని దేశం ఎదుర్కొన్నట్లు తెలిపింది. 1993లో సుమారు 172 మిడతల దండులు పంటలపై దాడి చేసినట్లు వివరించింది. ఆ తర్వాత మళ్లీ ఈ ఏడాది తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం సుమారు 60 దేశాలపై మిడదల ప్రభావం ఉందని తెలిపింది మిడతల హెచ్చరిక సంస్థ.

మిడతల్లో రకాలు...

  • ఎడారి మిడతలు
  • ముంబయి మిడతలు
  • వలస మిడతలు
  • ఇటాలియన్​ మిడతలు
  • మొరాకాన్​ మిడతలు
  • ఎరుపు మిడతలు
  • ఊదా రంగు మిడతలు
  • దక్షిణ అమెరికా మిడతలు

భారత్​లో ఎక్కువగా వలస, ఎడారి, ముంబయి, చెట్ల మిడతలు సంచరిస్తుంటాయి. సాయంత్రం సమయాల్లో ఎక్కువగా ఇవి పంటలపై దాడి చేస్తుంటాయని నిపుణులు తెలిపారు.

ఇదీ చూడండి:మిడతలపై ముప్పేటదాడికి సిద్ధమవుతున్న ప్రభుత్వాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.