ETV Bharat / bharat

కరోనాపై పోరు: మే 3 వరకు లాక్​డౌన్​లోనే దేశం - modi on lockdown

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ను మరో 19 రోజులు కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. కరోనాను కట్టడి చేసేందుకు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. పరిస్థితులను బట్టి ఏప్రిల్​ 20 తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు సడలిస్తామని చెప్పారు. దేశ ప్రయోజనాలను దృషిలో పెట్టుకొని.. ప్రతి పౌరుడూ సహనం, క్రమశిక్షణతో మెలగాలని కోరారు. కరోనా తీవ్రత పెరగకముందే నివారణ చర్యలు తీసుకున్నామని.. పరోక్షంగా విపక్షాల విమర్శలను తిప్పికొట్టారు మోదీ.

Lockdown extended till May 3
లాక్​డౌన్​ 3వరకు పొడిగింపు
author img

By

Published : Apr 14, 2020, 11:54 AM IST

Updated : Apr 14, 2020, 12:16 PM IST

కరోనా కట్టడే లక్ష్యంగా విధించిన దేశవ్యాప్త లాక్​డౌన్​ను మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు ప్రధాని నరేంద్రమోదీ. మార్చి 24న మొదలైన 21 రోజుల లాక్​డౌన్​ ఇవాళ్టితో ముగియనున్న నేపథ్యంలో.. జాతిని ఉద్దేశించి ప్రసంగించారు ప్రధాని. లాక్​డౌన్​ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతున్నా... ప్రజల ప్రాణాలే ముఖ్యమని ఉద్ఘాటించారు.

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనాపై భారత్​ బలమైన యుద్ధం చేస్తోందని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. లాక్‌డౌన్‌ వల్ల ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నా... వైరస్​ నివారణకు దేశ ప్రజలంతా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. యుద్ధంలో గెలిచే వరకు సహనంగా ఉండాలని వారిని కోరారు.

కొత్త మార్గదర్శకాలు.. సడలింపులు

రెండో దశలో.. లాక్​డౌన్​ అమలు మరింత కఠినంగా ఉంటుందని చెప్పారు ప్రధాని. రానున్న రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని... కొత్త ప్రాంతాల్లో వైరస్​ వ్యాపించకుండా జాగ్రత్తలు పాటించాలని దిశానిర్దేశం చేశారు. కొత్త లాక్​డౌన్​కు సంబంధించి సమగ్ర మార్గదర్శకాలు బుధవారం వెలువడుతాయని పేర్కొన్నారు.

హాట్​స్పాట్​లుగా ప్రకటించని ప్రాంతాల్లో ఏప్రిల్​ 20 తర్వాత.. మినహాయింపులుంటాయని తెలిపారు మోదీ. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే.. సండలింపులను వెంటనే ఉపసంహరించుకుంటామని హెచ్చరించారు.

''ఏప్రిల్​ 20 వరకు అన్ని జిల్లాలు, స్థానిక యంత్రాగాలు, రాష్ట్రాలు... దగ్గరుండి పరిస్థితిని పర్యవేక్షించాలి. ఆంక్షలు కఠినంగా అమలు చేయాలి. హాట్​స్పాట్​లు మరింత పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా తీవ్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొన్ని మినహాయింపులుంటాయి.''

- నరేంద్ర మోదీ, భారత ప్రధాని.

విపక్షాలకు చురకలు...

కరోనా కట్టడిలో కేంద్రం ఆలస్యంగా స్పందించిందని విపక్షాలు చేసిన విమర్శల్ని పరోక్షంగా తిప్పికొట్టారు ప్రధాని. దేశం​లో కరోనా తీవ్రంగా మారకముందే.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు మోదీ. కేసులు వందకు చేరినప్పుడే విదేశీ ప్రయాణికుల్ని ఐసోలేషన్​లో ఉంచామని.. 500 కేసులు ఉన్నప్పుడే లాక్​డౌన్​ ప్రకటించామని నొక్కిచెప్పారు.

మహమ్మారి కట్టడికి కేంద్రం సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేయకపోతే పరిస్థితులు మరింత దారుణంగా మారేవని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఎదుర్కొంటున్న పరిస్థితులు బట్టి చూస్తే.. భారత్​ మెరుగైన స్థితిలోనే ఉందని వివరించారు మోదీ.

ప్రపంచ నివేదికల ప్రకారం.. కేసులు 10 వేలు దాటితే 1500 నుంచి 1600 పడకలు అవసరం అవుతాయని.. దేశంలో ఇప్పటికే లక్షకు పైగా పడకలు ఏర్పాటుచేశామని చెప్పారు. దేశవ్యాప్తంగా 600కుపైగా ఆసుపత్రులు, 220కిపైగా ల్యాబ్​ల్లో కరోనా నిర్ధరణ పరీక్షలు జరుగుతున్నాయని వెల్లడించారు ప్రధాని.

సప్తసూత్రాలు...

కరోనాను తుదముట్టించేందుకు ఏడు సూత్రాలు తప్పనిసరిగా పాటించాలని ప్రజలను కోరారు మోదీ.

Lockdown extended till May 3
.

ఇదీ చూడండి: లాక్​డౌన్​ను మే 3 వరకు పొడిగించింది ఇందుకే...

Last Updated : Apr 14, 2020, 12:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.