ETV Bharat / bharat

నేటి నుంచే లాక్​డౌన్ 3.0.. జోన్లవారీగా సడలింపులివే - lockdown 3.0 today onwards

దేశవ్యాప్తంగా లాక్​డౌన్ 3.0 నేటితో అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో వైరస్ ఏ మేరకు వ్యాప్తి చెందిందనే అంశం ఆధారంగా వివిధ జోన్లుగా విభజించిన ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లోని వారికి ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

lockdown 3.0
నేటి నుంచే లాక్​డౌన్ 3.0.. జోన్లవారీగా సడలింపులు
author img

By

Published : May 4, 2020, 6:04 AM IST

Updated : May 4, 2020, 6:47 AM IST

దేశంలో కరోనా నియంత్రణ దిశగా లాక్​డౌన్ 3.0 అమలులోకి వచ్చింది. అయితే ఆయా ప్రాంతాలను పలు జోన్లుగా విభజించిన సర్కారు.. ఆ మేరకు పలు సడలింపులు అమలు చేస్తోంది. అయితే కంటెయిన్​మెంట్ ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగుతాయని ప్రకటించింది. లాక్​డౌన్ 3.0 ఇవాళ్టి నుంచి మే 17వరకు కొనసాగనుంది.

ఈ సేవలు బంద్..

జోన్లు, ప్రభావిత ప్రాంతాలు అనే భేదం లేకుండా విమానాలు, రైల్వే, మెట్రో, రహదారి మార్గం ద్వారా అంతరాష్ట్ర ప్రయాణాలు నిలిచిపోతాయి. విద్యాసంస్థలు, రెస్టారెంట్లు, హోటళ్ల మూసివేత కొనసాగుతుంది. సినిమా హాళ్లు, మాల్​లు, క్రీడా ప్రాంగణాలు, రాజకీయ, సామాజిక సమావేశాలపై నిషేధం యథావిధిగా ఉంటుంది. వైరస్ ప్రభావిత ప్రాంతాలు మినహా.. ఇతర ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల మధ్య ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు అవకాశం ఉంది.

lockdown
లాక్​డౌన్ అమలు తీరిదే..

ఈ ప్రాంతాల్లో క్షౌరశాలలకు అవకాశం..

గ్రీన్, ఆరెంజ్​ జోన్లలోని క్షౌరశాలలు, స్పాలు తెరిచేందుకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఈ- కామర్స్ సంస్థల ద్వారా కొనుగోళ్లకు అవకాశం ఇచ్చింది.

'సరుకు' అందుబాటులో..

కంటెయిన్​మెంట్ ప్రాంతాలు మినహా మిగతా అన్ని చోట్లా మద్యం అందుబాటులో ఉంటుంది. అయితే మార్కెట్ ప్రాంతాల్లో అమ్మకాలకు అవకాశం కల్పించలేదు. ఒక్కటిగా ఉన్న దుకాణాల్లో మాత్రమే అమ్మవచ్చని స్పష్టత ఇచ్చింది కేంద్రం. కరోనా నియంత్రణ దిశగా జాగ్రత్త చర్యలు చేపట్టి కొనుగోళ్లు చేయాలి.

వారికి అవకాశం లేదు..

అన్ని జోన్లలోని అనారోగ్యంగా ఉన్న వృద్ధులు, 10 ఏళ్ల లోపు చిన్నపిల్లలకు బయట తిరగకూడదు. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే విమానం, రైలు, రహదారి మార్గం ద్వారా ప్రయాణాలకు అనుమతి ఇస్తారు. కంటెయిన్​మెంట్ ప్రాంతాల్లోని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదు.

అన్ని జోన్లలోని వారు చేసేందుకు అనుమతించిన కార్యకలాపాలు ఆస్పత్రుల్లోని ఔట్ పేషెంట్ విభాగం, క్లినిక్​లకు అన్ని జోన్లలో నడపవచ్చు. అయితే భౌతిక దూరం పాటిస్తూ ఈ సేవలను వినియోగించుకోవాలి. అయితే కంటెయిన్​మెంట్ జోన్లలో ఇందుకు అవకాశం లేదు.

సరుకు రవాణాకు అన్ని ప్రాంతాల్లో అనుమతులు. దేశాల మధ్య ఎగుమతి, దిగుమతులు కొనసాగుతాయి.

రెడ్​ జోన్లలో

కంటెయిన్​మెంట్ జోన్లు మినహా రెడ్​ జోన్లలో సైకిల్ రిక్షాలు, ఆటో రిక్షాలు.. టాక్సీలు, క్యాబ్​లు తిరిగేందుకు అవకాశం లేదు. జిల్లా లోపల, అంతర్​ జిల్లాల మధ్య బస్సు సర్వీసులు ఉండవు. కటింగ్ షాపులు తెరవకూడదు. పలు అనుమతించిన కార్యకలాపాల కోసం ఫోర్​వీలర్స్​లో డ్రైవర్​ మినహా ఇద్దరు మాత్రమే ఉండాలి. ఈ-కామర్స్ సంస్థలు అత్యవసర సరుకులు మాత్రమే అమ్మాలి. మద్యం దుకాణాల్లో రెండు అడుగుల దూరం పాటిస్తూ కొనుగోళ్లు చేయాలి. ఒకేసారి ఐదుగురు మినహా కొనుగోలుదారులు ఉండకూడదు. ఇళ్లలో సేవల కోసం కాలనీ వారి అనుమతులతోనే బయటివారిని లోపలకు వదలాలి.

కంటెయిన్​మెంట్ జోన్లు మినహా సెజ్​లు, ఎగుమతి కేంద్రాలు వంటి వ్యాపార సంబంధ ప్రాంతాలు, పారిశ్రామిక వాడల్లో కార్యకలాపాలకు నేటి నుంచి అవకాశం.

రెడ్​ జోన్లలోని ప్రైవేటు కార్యాలయాలు 33 శాతం సిబ్బందితో పనిచేయవచ్చు.

పట్టణాల్లో..

కంటెయిన్​మెంట్ ప్రాంతాలు మినహా పట్టణాల్లోని రెడ్​జోన్లలో అత్యవసర వస్తువుల ఉత్పత్తి కార్యకలాపాలు కొనసాగుతాయి. ఔషధాలు, వైద్య పరికారాలు, వాటి రవాణా, ఐటీ పరికరాల ఉత్పత్తి, జౌళీ పిరశ్రమ, నిర్మాణ రంగం పనులు సాగుతాయి. వృద్ధులు, చిన్నపిల్లలు వంటి వారికి ఆపరేషన్లు చేస్తారు.

గ్రామాల్లో..

పరిశ్రమలు, నిర్మాణ కార్యకలాపాలు, వ్యవసాయం, పశుపోషణ, మొక్కల పెంపకం, బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీలు, కొరియర్, పోస్టల్ సేవలు, మీడియా, ఐటీ వంటివి కొనసాగుతాయి.

ఆరెంజ్ జోన్లలో..

కంటెయిన్​మెంట్ జోన్లు మినహా రెడ్ జోన్లలో అనుమతించే అన్ని కార్యకలాపాలు నిర్వహించవచ్చు. జిల్లాల మధ్య రాకపోకలు సాగుతాయి. ఫోర్​ వీలర్స్​లో ఇద్దరు ప్యాసింజర్లలో ప్రయాణించేందుకు అవకాశం. ద్విచక్రవాహనాలకు అనుమతులు ఉంటాయి. జిల్లాల మధ్య బస్సుల రాకపోకలు ప్రారంభమవుతాయి.

గ్రీన్​ జోన్లలో..

దేశంలో అనుమతించని కార్యకలాపాలు మినహా.. అన్ని పనులకు అవకాశం. 50 శాతం సామర్థ్యంతో బస్సులు తిరగొచ్చు. డిపోల్లోనూ 50 శాతం బస్సులే ఉండాలి.

21 రోజులుగా వైరస్ కేసులు నమోదు కాకపోతే గ్రీన్ జోన్లుగా వ్యవహరిస్తారు.

ఇదీ చూడండి: 'హెచ్​1బీ వీసాలు, గ్రీన్​కార్డులపై అనిశ్చితి నెలకొంది'

Last Updated : May 4, 2020, 6:47 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.