ETV Bharat / bharat

'ఆ మంటల్లో పడి మీరు చావలేదుగా'

author img

By

Published : Feb 27, 2020, 7:47 AM IST

Updated : Mar 2, 2020, 5:18 PM IST

దిల్లీలో జరుగుతోన్న విధ్వంసాలతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఎప్పుడు ఎవరు వచ్చి కాల్పులు జరుపుతారోనని బిక్కు బిక్కుమంటున్నారు. నిరసనలతో సంబంధం లేని చాలా మంది అల్లర్లలో ప్రాణాలు కోల్పోయారు. వారికి అండగా నిలవాల్సిన పోలీసులూ నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈశాన్య దిల్లీలో జరిగిన అల్లర్లలో ఆప్తులను కోల్పోయిన కొంత మంది కన్నీటి గాథలు ఇవి.

DELHI TRAGEDY
దిల్లీ విధ్వంసం

ఒకవైపు కళ్ల ఎదుటే విధ్వంసాలు, అగ్నికి ఆహుతవుతున్న ఆస్తులు..మరోవైపు దాడులు. ఎవరు ఎటు నుంచి వచ్చి కాల్పులు జరుపుతున్నారో తెలియని పరిస్థితిలో దిల్లీ వాసులు అనేక మంది ప్రాణాలు అరచేత పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చింది. ప్రత్యేకించి ఘర్షణలు ఉద్ధృతంగా జరిగిన ఈశాన్య దిల్లీలో అనేక కుటుంబాలకు గత మూడు రోజులూ క్షణమొక యుగంలానే గడిచింది. రక్షణ కోసం పోలీసులకు ఫోన్‌ చేసినా స్పందన లేదు. క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకువెళ్లాలంటే అంబులెన్సులు అందుబాటులో లేక తల్లడిల్లిపోయారు.

నాన్నను రక్షించుకోలేకపోయా..

గోండా ప్రాంతంలో ఓ యాభై ఏళ్ల వ్యక్తి తన ఇంటి వద్ద ఆందోళనలు చేస్తున్న ఇరువర్గాల వారినీ సముదాయించేందుకు ప్రయత్నించాడు. ఇంతలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అతనిపై కాల్పులు జరిపాడు..బుల్లెట్‌ శరీరంలోకి దూసుకుపోవడం వల్ల కుప్పకూలిపోయాడు.. పక్కనే ఉన్న ఆ వ్యక్తి కుమారుడు తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చింది. 'పోలీసుల కోసమని 100కు ఫోన్‌ చేశాను..ఎవరూ స్పందించలేదు. వెంటనే అంబులెన్స్‌ కోసం ఫోన్‌ చేసినా ఫలితం లేకపోయింది. సుమారు 5 కి.మి దూరంలో ఉన్న ఆసుపత్రికి ఓ మిత్రుడి ద్విచక్రవాహనంపై రక్తంతో తడిసి ముద్దైన మా నాన్నను తీసుకువెళ్లాల్సి వచ్చింది. అయినా ఫలితం లేకపోయింది'అని ఓ యువకుడు కన్నీరు పెట్టుకున్నాడు.

బతుకుపైనే ఆశలు వదులుకున్నాం..

చాంద్‌ బాగ్‌లోని బాధితులది మరో కన్నీటి వ్యథ..తమకు జీవనోపాది కల్పించే దుకాణాలు, ఇళ్లు కాలిపోతున్నా ఎవరూ పట్టించుకోని పరిస్థితి వారిది. పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసినా ఏ ఒక్కరూ స్పందించకపోయేసరికి బతుకుపైనే ఆశలు వదులుకున్నామని వారు చెపుతున్నారు. "నేను చికెన్‌ దుకాణం నడుపుతాను..మా సోదరులిద్దరికీ పళ్ల దుకాణాలు ఉన్నాయి. వాటిని పూర్తిగా దగ్ధం చేశారు. ఫోలీసులకు ఎన్ని సార్లు ఫోన్లు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. చివరికి ఒక సారి ఫోన్‌ తీశారు. మా గోడు చెప్పుకుంటే.. 'ఇప్పుడు ఏమైంది?' మీరు మంటల్లో చచ్చిపోలేదు కదా.. ఎందుకు భయపడుతున్నారు. అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు" అని ఆ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ముసుగులు ధరించి వచ్చిన వ్యక్తులు కొందరు మతాలతో సంబంధం లేకుండా అందరిపైనా దాడి చేశారంటూ మరో యువకుడు వాపోయాడు. 'భజన్‌పుర మార్కెట్‌ గత మూడు రోజులుగా మూతపడింది. పిల్లల కోసం కనీసం పాలు లేవు, నిత్యావసరాలు దొరకడం లేదు. విద్యుత్తు లేదు' అని భజన్‌పుర్‌లో ఒక ఫంక్షన్‌ హాల్‌ యజమాని తన గోడు వెళ్లబోసుకున్నాడు.

ఇదీ చూడండి:ఆ స్ఫూర్తిని కాలరాస్తే- దేశం ఎటుపోతున్నట్లు..?

Last Updated : Mar 2, 2020, 5:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.