ETV Bharat / bharat

'శానిటైజర్​ అమ్మకాలకు లైసెన్స్ అవసరం లేదు'

హ్యాండ్ శానిటైజర్ల నిల్వ, అమ్మకాలకు లైసెన్స్​లు తొలగిస్తూ కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఉద్ధృతి పెరుగుతున్న వేళ... ప్రజలకు మరింత విస్తృతంగా శానిటైజర్లు అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Licence for stocking and sale of hand sanitiser no longer required: Govt
శానిటైజర్​ అమ్మకాలకు లైసెన్స్ అవసరం లేదు: కేంద్రం
author img

By

Published : Jul 29, 2020, 12:48 PM IST

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ... హ్యాండ్ శానిటైజర్ల నిల్వ, అమ్మకాల లైసెన్స్​లను తొలగిస్తూ కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మరింత విస్తృతంగా హ్యాండ్ శానిటైజర్స్​ అందుబాటులో ఉండేలా చూడడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకుంది.

అధికారిక నోటిఫికేషన్

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ నిబంధనల నుంచి హ్యాండ్ శానిటైజర్ల నిల్వ, అమ్మకాలకు మినహాయింపు ఇచ్చింది. జులై 27న ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రజాప్రయోజనం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. అయితే చిల్లర వ్యాపారులు... ఈ శానిటైజర్ ఉత్పత్తులను గడువు ముగిసిన తరువాత విక్రయించకూడదని, నిల్వ చేయరాదని తేల్చిచెప్పింది.

హ్యాండ్ శానిటైజర్లను అమ్మకపు లైసెన్స్​ అవసరం నుంచి మినహాయించాలని పలు ప్రతిపాదనలు వచ్చిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇదీ చూడండి: దేశంలో కొత్తగా 48,512 కేసులు.. 768 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.