ETV Bharat / bharat

మాజీ ప్రధాని రాజీవ్​కు ప్రముఖుల నివాళి

భారత మాజీ ప్రధానమంత్రి, దివంగత నేత రాజీవ్​ గాంధీ 76వ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీ సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. రాజీవ్​ గాంధీ ఉన్నత వ్యక్తిత్వం, ముందుచూపు గల దార్శనికుడని పేర్కొన్నారు రాహుల్​.

author img

By

Published : Aug 20, 2020, 12:59 PM IST

Rajiv Gandhi
మాజీ ప్రధాని రాజీవ్​ గాంధీకి ప్రముఖుల నివాళి

భారత మాజీ ప్రధాని, దివంగత నేత రాజీవ్​ గాంధీ 76వ జయంతి సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.

ఆగస్టు 20న జన్మించిన రాజీవ్​ గాంధీ.. 1984-89 మధ్య ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1991లో ఎన్నికల ప్రచారంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయారు.

ఆయన కృషి మరవలేనిది: వెంకయ్య

రాజీవ్​ గాంధీ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఐటీ రంగానికి ఆయన చేసిన కృషి ఎప్పుడూ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు.

మోదీ నివాళులు..

రాజీవ్​ గాంధీకి నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

Rajiv Gandhi
మోదీ ట్వీట్​

ముందుచూపుగల దార్శనికుడు: రాహుల్​

రాజీవ్​ గాంధీ ఉన్నత వ్యక్తిత్వం, ముందుచూపు గల దార్శనికుడని ఆయన కుమారుడు, కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ పేర్కొన్నారు. 'రాజీవ్​ గాంధీ భవిష్యత్తును ఆలోచించే అద్బుతమైన దూరదృష్టి కలిగిన వ్యక్తి, అన్నిటినీ మించి ఆయనది కరుణ, ప్రేమించే తత్వం గల ఉత్తమ వ్యక్తిత్వం. ఆయన నాకు తండి కావటం నా అదృష్టం. నేను అందుకు గర్వపడుతున్నా. ఆయనను నేడు, రేపు, ప్రతిరోజు మిస్​ అవుతూనే ఉంటాము' అని పేర్కొన్నారు రాహుల్​.

Rajiv Gandhi
రాహుల్​ గాంధీ ట్వీట్​

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, రాజస్థాన్​ సీఎం అశోక్​ గహ్లోత్​, మధ్యప్రదేశ్​ సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్​, కెప్టెన్​ అమరిందర్​ సింగ్​ తదితరులు రాజీవ్​ గాంధీని స్మరించుకున్నారు.

Rajiv Gandhi
కాంగ్రెస్​ ట్వీట్​

ఇదీ చూడండి: సరికొత్త చీర.. కట్టుకుంటే కరోనా రాదంట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.