దేశంలోని పలువురు నాయకులు కుటుంబ సభ్యులతో దీపావళి వేడుకలు జరుపుకున్నారు.
రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. దిల్లీలోని తన నివాసంలో దీపాలు వెలిగించారు.
హైదరాబాద్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో దీపావళి వేడుకలు జరుపుకున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన నివాసంలో కాళీ పూజ నిర్వహించారు.
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్‌తో కలిసి అక్షర్‌ధామ్‌లో జరిగే దీపావళి వేడుకలకు హాజరయ్యారు. దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా ఆయన సతీమణితో ఈ వేడుకలకు హాజరయ్యారు.
ఇదీ చదవండి:మహారాష్ట్రలో ఆలయాల పునఃప్రారంభానికి సీఎం గ్రీన్‌సిగ్నల్